మీరు ఆగస్టులో రైలులో ప్రయాణించాలని నిర్ణయించుకుంటే, బయలుదేరే ముందు ఖచ్చితంగా ఈ సమాచారాన్ని తెలుసుకోండి. సాంకేతిక మెరుగుదలలు, ట్రాక్ మరమ్మతుల కారణంగా రైల్వేలు పలు మార్గాల్లో అనేక రైళ్లను రద్దు చేశాయి. దేశంలో ప్రతిరోజూ కోట్లాది మంది రైలులో ప్రయాణిస్తున్నారు. ప్రతి రోజు పెద్ద సంఖ్యలో రైళ్లు నడుస్తున్నాయి. అయితే ట్రాక్ మరమ్మతులు, ఇతర మరమ్మతుల కారణంగా చాలా వరకు రైళ్లు రద్దు అయ్యాయి. వచ్చే నెల నుంచి సెప్టెంబర్ వరకు అనేక రైళ్లు రద్దు అయ్యాయి. ఏయే రైళ్లు ఉన్నాయో తెలుసుకుందాం.
ఇది కూడా చదవండి: School Holidays: భారీ వర్షాలు.. విద్యార్థులకు సెలవులు ప్రకటించిన అధికారులు!
- రైలు నంబర్ 18175/18176 హతియా – ఝార్సుగూడ – హతియా మెము ఎక్స్ప్రెస్ 18 ఆగస్టు 2025 నుండి 10 సెప్టెంబర్ 2025 వరకు రద్దు.
- రైలు నంబర్ 17007 చర్లపల్లి – దర్భంగా ఎక్స్ప్రెస్ (వయా – రాంచీ) 26 ఆగస్టు 2025, 9 సెప్టెంబర్ 2025 తేదీలలో రద్దు.
- రైలు నంబర్ 17008 దర్భంగా – చర్లపల్లి ఎక్స్ప్రెస్ (వయా – రాంచీ) 29 ఆగస్టు, 12 సెప్టెంబర్ 2025 తేదీలలో రద్దు.
- రైలు నంబర్ 18523 విశాఖపట్నం – బనారస్ ఎక్స్ప్రెస్ (వయా – రాంచీ) 27 ఆగస్టు , 31 ఆగస్టు, సెప్టెంబర్ 7,10 తేదీల్లో రద్దు.
- రైలు నంబర్ 18524 బనారస్ – విశాఖపట్నం ఎక్స్ప్రెస్ (వయా – రాంచీ) ఆగస్ట్ 28, సెప్టెంబర్ 1, 8, 11 తేదీలలో రద్దు.
- రైలు నంబర్ 17005 హైదరాబాద్ – రక్సౌల్ ఎక్స్ప్రెస్ (వయా – రాంచీ) 28 ఆగస్టు 2025న రద్దు చేశారు.
- రైలు నంబర్ 17006 రక్సౌల్ – హైదరాబాద్ ఎక్స్ప్రెస్ (వయా – రాంచీ) ఆగస్టు 31న రద్దు.
- రైలు నంబర్ 07051 చర్లపల్లి – రక్సౌల్ స్పెషల్ (వయా – రాంచీ), ఆగస్టు 30 తేదీలో రద్దు.
- రైలు నంబర్ 07052 రక్సౌల్ – చర్లపల్లి స్పెషల్ (వయా – రాంచీ), సెప్టెంబర్ 2 రద్దు.
- రైలు నంబర్ 07005 చర్లపల్లి – రక్సౌల్ స్పెషల్ (వయా – రాంచీ), సెప్టెంబర్ 1న రద్దు.
- రైలు నంబర్ 07006 రక్సౌల్ – చర్లపల్లి స్పెషల్ (వయా – రాంచీ), సెప్టెంబర్ 4న రద్దు.
- రైలు నంబర్ 18310 జమ్మూ తావి – సంబల్పూర్ ఎక్స్ప్రెస్ (వయా – రాంచీ), సెప్టెంబర్ 7న రద్దు.
- రైలు నంబర్ 13425 మాల్డా టౌన్ – సూరత్ ఎక్స్ప్రెస్ (వయా – రాంచీ) సెప్టెంబర్ 6న రద్దు.
- రైలు నంబర్ 13426 సూరత్ – మాల్డా టౌన్ ఎక్స్ప్రెస్ (వయా – రాంచీ) సెప్టెంబర్ 8న రద్దు.
- రైలు నంబర్ 15028 గోరఖ్పూర్ – సంబల్పూర్ ఎక్స్ప్రెస్ సెప్టెంబర్ 8న రద్దు.
- రైలు నంబర్ 18309 సంబల్పూర్ – జమ్మూ తావి ఎక్స్ప్రెస్ (వయా – రాంచీ) సెప్టెంబర్ 9న రద్దు.
- రైలు నంబర్ 15027 సంబల్పూర్ – గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ సెప్టెంబర్ 9న రద్దు.
ఈ రైళ్లను స్వల్పకాలిక రద్దు:
- రైలు నంబర్ 15028 గోరఖ్పూర్ – సంబల్పూర్ ఎక్స్ప్రెస్ ఆగస్టు 23, 27, 29, 31వ తేదీలలో హతియా స్టేషన్లో స్వల్పకాలికంగా నిలిపివేశారు. ఈ రైలు హతియా -సంబల్పూర్ మధ్య స్వల్పకాలికంగా నిలిపివేయనున్నారు.
- రైలు నంబర్ 15027 సంబల్పూర్ – గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ ఆగస్టు 24న 26, 28, 30, అలాగే సెప్టెంబర్ 1 తేదీలలోహతియా స్టేషన్లో స్వల్పకాలికంగా నిలిపివేయనున్నారు. ఈ రైలు సంబల్పూర్ – హతియా మధ్య స్వల్పకాలికంగా నిలిపివేయనున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి