
బాలీవుడ్ ఖిలాడి అక్షయ్ కుమార్ సినిమాలతో కాకుండా యాడ్స్, వ్యాపారంతో బాగానే సంపాదిస్తున్నాడు. గత కొన్నేళ్లుగా అక్షయ్ పెద్దగా హిట్లు కొట్టడం లేదు. సూర్యవంశీ తర్వాత, హౌస్ ఫుల్ 5 తప్ప, మిగితా సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేవు. అయినా అతడి సంపాదనకు వచ్చిన ఢోకా ఏం లేదు. ఎందుకంటే సినిమాలే కాకుండా ఆస్తులు అమ్మడం ద్వారా అక్షయ్ పెద్ద మొత్తంలో లాభాలు అర్జిస్తున్నాడు. ఇటీవల అక్షయ్ రెండు ఆస్తులను అమ్మాడు. వీటిలో ఆయనకు రెట్టింపు లాభాలు రావడం గమనార్హం.
పెట్టుబడి దాదాపు రెట్టింపు ..
నటుడు అక్షయ్ కుమార్ ముంబై బోరివాలి తూర్పులోని ఒకే హౌసింగ్ ప్రాజెక్టులో రెండు ఆస్తులను రూ.7.10 కోట్లకు అమ్మారు. వీటిని 2017లో రూ.3.7 కోట్లకు అక్షయ్ కొనుగోలు చేశారు. 8 ఏళ్లలో అక్షయ్ కుమార్ రెండు ఆస్తుల నుండి రూ.3.4 కోట్ల లాభం పొందాడు. అంటే 8 ఏళ్లలో రెండు ఆస్తులలో పెట్టుబడి దాదాపు 92 శాతం రాబడిని ఇచ్చింది.
రెండు ఆస్తుల ప్రత్యేకతలు
అక్షయ్ విక్రయించిన మొదటి ఆస్తి 1,101 చదరపు అడుగుల వైశాల్యం కలిగిన ఫ్లాట్ ఉంది. దీని విలువ రూ. 5.75 కోట్లు. ఈ ఒప్పందంలో రూ. 34.50 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లించారు. 2017లో రూ. 3.02 కోట్లకు ఈ ఆస్తిని కొనుగోలు చేశాడు. ఇక 252 చదరపు అడుగుల కార్పెట్ విస్తీర్ణంలో ఉన్న రెండవ ఆస్తిని రూ. 1.35 కోట్లకు అమ్ముడుపోయింది. ఈ లావాదేవీపై రూ. 6.75 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లించారు. 2017లో దీనిని రూ. 67.90 లక్షలకు కొనుగోలు చేశాడు.
ఈ ఆస్తులు ఏ ప్రాజెక్టులో..
ఈ రెండు ఆస్తులు ఒబెరాయ్ రియాలిటీ ఉన్న రెడీ-టు-మూవ్-ఇన్ ప్రాజెక్ట్‌లో ఉన్నాయి. 35 ఎకరాలలో ఈ ప్రాజెక్టు చేపట్టారు. బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ మాత్రమే కాకుండా మే 2024లో ఈ ప్రాజెక్ట్‌లో బహుళ ఆస్తులను కొనుగోలు చేశారు. బాలీవుడ్ సెలబ్రిటీలు ఎక్కువగా ముంబై, ఇతర ప్రధాన మెట్రోలలో ప్రీమియం హౌసింగ్ ప్రాజెక్టులను ఎంచుకుంటున్నారు. ఆ తర్వాత వాటిని అమ్ముతూ మంచి లాభాలు పొందుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..