హెల్త్‌

హెల్త్‌


మన భారతీయ వంటకాల్లో వెల్లుల్లికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. టేస్టీ కూరల నుండి పప్పు, నూనె లాంటి అన్నింటికీ అదిరిపోయే రుచి, సువాసన ఇవ్వడానికి కొన్ని వెల్లుల్లి రెబ్బలు చాలు. అయితే రుచి ఇవ్వడంలో మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది.

వెల్లుల్లిలోని యాంటీ బయోటిక్ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో ముఖ్యంగా పనిచేస్తాయి. కడుపులో గ్యాస్, వాంతులు, ఎసిడిటీ లాంటి సమస్యలకు సహజ పరిష్కారం కావాలంటే.. ఖాళీ కడుపుతో తేనెతో కలిపి వెల్లుల్లిని తినడం మంచి పద్ధతి అని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.

ఒక రెబ్బ వెల్లుల్లిని చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక చిన్న గిన్నెలో వేసుకోవాలి. అందులో ఒకటి రెండు తేనె చుక్కలు వేసి రెండు నిమిషాలపాటు అలాగే ఉంచాలి. తర్వాత దాన్ని బాగా నమిలి మింగాలి. ఆ రుచి స్ట్రాంగ్‌ గా అనిపిస్తే గోరువెచ్చని నీళ్లు 2 నుంచి 3 గ్లాసులు తాగవచ్చు.

మరో పద్ధతి.. 10 వెల్లుల్లి రెబ్బలను చిన్న ముక్కలుగా కట్ చేసి.. దానికి 5 టేబుల్ స్పూన్లు తేనె కలిపి గాలి చొరబడని సీసాలో పెట్టుకోండి. ప్రతిరోజూ ఓ టీ స్పూన్ మిశ్రమాన్ని ఖాళీ కడుపుతో తీసుకుంటే శరీరానికి చాలా మంచి చేస్తుంది. ఈ మిశ్రమం ఫ్రిజ్‌లో పెట్టకుండానే వారం పాటు నిల్వ ఉంటుంది.

ఈ మిశ్రమాన్ని తినడానికి బెస్ట్ టైం ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం. ఎందుకంటే పచ్చి వెల్లుల్లి కొందరికి ఎసిడిటీని పెంచే అవకాశం ఉంటుంది. కానీ తేనెతో కలిపినప్పుడు అది తగ్గుతుంది. ఈ కాంబినేషన్ కడుపులోని హానికరమైన సూక్ష్మజీవులను తొలగించి జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది.

వెల్లుల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి. అందుకే బరువు తగ్గాలనుకునే వాళ్ళు దీన్ని డైట్‌ లో చేర్చుకోవచ్చు. తేనెతో కలిపినప్పుడు ఇది మరింత ఎఫెక్టివ్‌ గా పనిచేస్తుంది.

తేనె, వెల్లుల్లి కాంబినేషన్ వల్ల కలిగే లాభాలు

  • వెల్లుల్లి రక్త ప్రసరణను మెరుగుపరిచి హై బీపీ కొలెస్ట్రాల్‌ ను కంట్రోల్ చేస్తుంది.
  • తేనె గుండెకు మేలు చేస్తూ.. చెడు కొలెస్ట్రాల్ అయిన LDL స్థాయిని తగ్గిస్తుంది.
  • కడుపులో గ్యాస్, అజీర్తి, మలబద్ధకం లాంటి సమస్యలకు ఈ మిశ్రమం సహజమైన పరిష్కారంగా పనిచేస్తుంది.
  • ఈ మిశ్రమాన్ని ఏడు రోజుల పాటు ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే శరీరంలో ఇన్‌ ఫ్లమేషన్ తగ్గుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
  • రోజూ పావు స్పూన్ తేనెతో పాటు ఒక రెబ్బ వెల్లుల్లిని తీసుకుంటే శరీరం యాక్టివ్‌ గా ఉండటమే కాకుండా.. బరువు పెరగకుండా ఉంచుతుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *