బీట్రూట్లో ఎన్నో విటమిన్లు, ఖనిజాలు దాగున్నాయి.. దీనిని రెగ్యులర్గా తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని మరింత మెరుగుపర్చుకోవచ్చు.. ఈ దుంప కూరగాయ ఆరోగ్యకరమైన ఆహారమని.. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. బీట్రూట్లో విటమిన్లు, ఖనిజాలతోపాటు.. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా, విటమిన్ ఏ, విటమిన్ సి, ఫోలేట్, మాంగనీస్, పొటాషియం, మెగ్నీషియం.. ఐరన్ వంటి పోషకాలు బీట్రూట్లో లభిస్తాయి. ఇవి రక్తపోటును తగ్గించడానికి, వ్యాయామ సామర్థ్యాన్ని పెంచడానికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి.