
నిద్ర అనేది శరీరానికి చాలా అవసరం. సరైన నిద్ర లేకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది. దేనిపై ఫోకస్ పెట్టలేరు. గత కొంతకాలంగా డ్రీమ్ రీకాల్ డిజార్డర్ అనేది స్లో పాయిజన్‌లాగా ఒక ముఖ్యమైన ఆరోగ్య సమస్యగా మారుతోంది. ఆరోగ్యంపై కలల ప్రభావం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయం. కాబట్టి మీకు అలాంటి అనుభవాలు పదే పదే ఎదురవుతుంటే.. దానిని తేలికగా తీసుకోకండి. వెంటనే మీ నిద్ర అలవాట్లను మెరుగుపరచుకోండి. లేకపోతే వైద్యులను సంప్రదించండి. నేటి బిజీ జీవితంలో, మంచి నిద్ర అనేది చాలా అవసరం. కాబట్టి నిద్ర పట్ల తగిన ఫోకస్ పెట్టాలి. కలలు కనడం ప్రతి వ్యక్తికి ఒక సాధారణ అనుభవం. కానీ కలలు మీ నిద్ర, మానసిక స్థితి, శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తే ఏం చేయాలి? ఇటీవలి కాలంలో డ్రీమ్ రీకాల్ డిజార్డర్ అనే దానితో చాలా మంది బాధపడుతున్నారు. దీంతో నిద్రకు అంతరాయం కలిగి.. రోజంతా అలసటగా ఉంటున్నారు.
డ్రీమ్ రీకాల్ డిజార్డర్ అంటే ఏమిటి?
డ్రీమ్ రీకాల్ డిజార్డర్ అనేది నిద్రకు సంబంధించిన మానసిక రుగ్మత. దీనిలో ఒక వ్యక్తికి కలలు చాలా ఎక్కువగా లేదా అసాధారణంగా స్పష్టంగా గుర్తుంటాయి. ఈ కలలు తరచుగా భయానకంగా, గందరగోళంగా ఉంటాయి. నిద్ర పోయినప్పుడు కూడా మనసులో మెదులుతూ ఉంటాయి. ఈ రుగ్మత నిద్రలో మరింత చురుకుగా ఉంటుంది. మెదడు చాలా చురుకుగా ఉన్నప్పుడు.. కలలు ఎక్కువగా వస్తాయి.
డ్రీమ్ రీకాల్ డిజార్డర్ లక్షణాలు..
ఈ పరిస్థితి యొక్క ప్రధాన లక్షణాలు తరచుగా మేల్కొలపడం, తగినంత నిద్ర రాకపోవడం, మేల్కొన్న తర్వాత కూడా కలను గుర్తుంచుకోవడం, రోజంతా అలసిపోవడం లేదా విశ్రాంతి లేకపోవడం. కొన్ని సందర్భాల్లో ఆ వ్యక్తి కలనే నిజం అనుకునే అవకాశాలు ఉన్నాయి. ఇది నిరాశ, ఆందోళన, భావోద్వేగ అస్థిరత వంటి మానసిక సమస్యలను కూడా కలిగిస్తుంది.
కలలను ఎందుకు గుర్తుకు తెస్తుంది?
నిపుణుల అభిప్రాయం ప్రకారం..ఒత్తిడి, నిరాశకు గురైనప్పుడు కలలు ఎక్కువగా గుర్తుంటాయి. సక్రమంగా నిద్రపోకపోవడం, రాత్రి గంటల పాటు మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌ను ఉపయోగించడం, నిద్రకు ముందు అధికంగా భోజనం చేయడం. కెఫిన్ తీసుకోవడం వంటివి ఈ సమస్యను పెంచుతాయి. కొంతమందిలో ఇది జన్యుపరమైనది కూడా కావచ్చు.
ఆరోగ్యంపై ప్రభావం..
డ్రీమ్ రీకాల్ డిజార్డర్ యొక్క అతిపెద్ద ప్రభావం నిద్ర నాణ్యతపై ఉంటుంది. గాఢంగా నిద్రపోకపోతే శరీరం, మనస్సు రెండింటికి రెస్ట్ ఉండదు. ఇది అలసట, తలనొప్పి, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ, ఫోకస్ పెట్టలేకపోవడం, మానసిక స్థితిలో మార్పులు వంటి సమస్యలను కలిగిస్తుంది. ఈ పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే, అది అధిక రక్తపోటు, హార్మోన్ల అసమతుల్యత, మానసిక రుగ్మతలకు కూడా కారణమవుతుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ కథనాల కోసం క్లిక్ చేయండి..