హెల్త్‌

హెల్త్‌


హెల్త్‌

మేక పాలు సులభంగా జీర్ణం అవుతాయి. అంతేకాకుండా చాలా మందికి ఎటువంటి సమస్యలు లేకుండా సరిపోతాయి. ఈ పాలలో విటమిన్లు, ఖనిజాలు, రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే వీటిని ఆరోగ్యానికి చాలా మంచివిగా భావిస్తారు. మన ఆయుర్వేద శాస్త్రంలో కూడా మేక పాలు ఆరోగ్యానికి చేసే మేలు గురించి వివరంగా చెప్పారు. మేక పాలు తాగడం వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

సులువుగా జీర్ణం

ఈ పాలలో కొవ్వు శాతం తక్కువగా ఉండటం వల్ల చాలా వేగంగా జీర్ణం అవుతాయి. తేలికగా అరిగే గుణం ఉండటంతో గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు రావు.

అలర్జీలు తక్కువ

ఆవు పాలలో ఉండే కొన్ని ప్రోటీన్లు కొందరికి అలర్జీని కలిగిస్తాయి. కానీ మేక పాలలో అలాంటి సున్నితమైన ప్రోటీన్లు తక్కువగా ఉంటాయి. అందువల్ల చాలా మంది అలర్జీ లేకుండా మేక పాలు తాగగలుగుతారు.

బలంగా ఎముకలు

కాల్షియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు మేక పాలలో ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా తయారు చేయడంలో సహాయపడతాయి. ముఖ్యంగా వృద్ధాప్యంలో వచ్చే ఎముకల బలహీనతను నివారించడంలో ఇది ఉపయోగపడుతుంది.

రోగనిరోధక శక్తికి బూస్ట్

మేక పాలలో ఉండే సెలీనియం వంటి ముఖ్యమైన ఖనిజాలు మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో తోడ్పడతాయి. ఇది వైరల్ వ్యాధులు, ఫ్లూ వంటి వాటి నుంచి మనకు రక్షణ ఇస్తుంది.

చర్మ ఆరోగ్యానికి మేక పాలు

లాక్టిక్ యాసిడ్ అనే పదార్థం ఈ పాలలో ఉండటం వల్ల చర్మానికి కావాల్సిన తేమను అందిస్తుంది. ఇది చర్మాన్ని మృదువుగా, సున్నితంగా ఉంచడమే కాకుండా.. ఎటువంటి ఇన్‌ఫెక్షన్లు రాకుండా చేస్తుంది.

మేక పాలు ఆరోగ్యానికి ఎంతో మంచి చేసే డ్రింక్ అయినప్పటికీ.. కొందరికి ఇది సరిపడకపోవచ్చు. అందువల్ల మేక పాలను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకునే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *