రాత్రి భోజనం తర్వాత యాలకులు నమలడం వల్ల జీర్ణక్రియ బలపడుతుంది. అలాగే వికారం, వాంతుల వంటి సమస్యల నివారణకు కూడా యాలకులను సహజ ఔషధంగా వాడతారు. యాలకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగానే కాకుండా, సౌందర్యపరంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఇందులో ఉన్న విటమిన్లు, ఫైటో న్యూట్రియంట్లు, ఎసెన్షియల్ ఆయిల్స్ అనేవి జుట్టుని, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయని వివరిస్తున్నారు.