చేపలతో పాటుగా చేప కళ్లు తినటం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. చేప కళ్ళలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలో శక్తిని సమంగా వినియోగించడంలో సహాయపడతాయి. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచి మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుతాయి..అధిక బరువు సమస్యతో బాధపడే వారికి కూడా మేలు చేస్తాయి. చేప కళ్లు తినటం వల్ల శరీర బరువు తగ్గించడంలో మేలు చేస్తుంది.
చేప కళ్లలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి చూపును మరింత మెరుగుపరుస్తుంది. కంటి సంబంధిత సమస్యలు రాకుండా కాపాడుతుంది. చాలా మందికి రాత్రి సమయంలో చూపు సరిగా కనపడదు. అలాంటివారు ఈ చేప కళ్లను తినడం వల్ల ఆ సమస్య కూడా తగ్గుతుంది. పిల్లలకు కూడా చిన్న వయసు నుంచే వీటిని తినడం అలవాటు చేస్తే… కంటి చూపు బాగుంటుంది.
అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు చేప కళ్లను తినడం వల్ల రక్తనాళాలు సరిగా పని చేస్తాయి. ఇది రక్తప్రసరణను బాగా నిర్వహించి, రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. దీంతో బీపీ నార్మల్లోకి వచ్చేస్తుంది. చేప కళ్లను రెగ్యూలర్గా తినటం వల్ల మతి మరుపు సమస్య దరి చేరకుండా ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ వచ్చే అల్జీమర్స్ లాంటి సమస్యలను కూడా దూరం చేయడంలో ఇది ఉపయోగపడుతుంది.
న్యూరోలాజికల్ సమస్యలతో బాధపడే పిల్లలు లేదా పెద్దలకు చేప కళ్ళు సహజమైన ఆహార ఔషధంగా పనిచేస్తాయి. వాటిలోని పోషకాలు మెదడు క్రియాశీలతను పెంచి, ఆటిజం లక్షణాలను కొంతవరకు తగ్గించగలవని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లల వికాసానికి చేప కళ్లు ఎంతగానో దోహదం చేస్తాయి. విటమిన్ బి12 నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. దీనికి గొప్ప మూలం చిన్న చేపల కళ్ళు.
నిద్రలేమితో బాధపడే వారు చేప కళ్లను తీసుకుంటే మంచి విశ్రాంతి లభించి నిద్ర బాగా పడుతుంది. చేప కళ్లల్లో కాల్షియం, విటమిన్ డి లో సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎముకల దృఢత్వానికి చాలా అవసరం. అలాగే చర్మం యవ్వనంగా కనిపించడానికి, వృద్ధాప్య లక్షణాలు ఆలస్యం చేయడానికి కూడా చేప కళ్లు బాగా సహాయపడతాయి. చేప కళ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీలు కొన్ని రకాల క్యాన్సర్ లను నిరోధించడంలో కూడా సహాయపడతాయని పలు పరిశోధనలు చెబుతున్నాయి.