శరీరానికి ఆరోగ్యంగా ఉండటానికి అనేక రకాల విటమిన్లు , ఖనిజాలు అవసరం. అయితే విటమిన్ బి, డి, సీ లపై పెట్టే దృష్టి విటమిన్-కె వంటి కొన్ని విటమిన్లపై పెట్టం. విటమిన్-కె మన శరీరానికి చాలా ముఖ్యమైనదని మీకు తెలుసా.. రక్తం గడ్డకత్తెలా చేయడం ఎముకల ఆరోగ్యాన్ని కాపాడడం ఈ విటమిన్ అతి ముఖ్యమైన పని.
అందువల్ల శరీరంలో విటమిన్ కే లోపం ఉంటే అధిక రక్తస్రావం లేదా ఎముకలు బలహీనపడటం వంటి అనేక తీవ్రమైన సమస్యలు సంభవించవచ్చు. అందువల్ల విటమిన్-కె లోపం ఏర్పడకుండా శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. ఈ రోజువిటమిన్ కే లోపం ఉంటే ఏ లక్షణాలు కనిపిస్తాయి? ఏ వస్తువుల నుంచి (విటమిన్-కె రిచ్ ఫుడ్స్) మనకు లభిస్తుందో తెలుసుకుందాం.
విటమిన్ K రెండు రకాలు:
విటమిన్ K1 (ఫైలోక్వినోన్): ఇదిబ్రోకలీ, కాలీఫ్లవర్ వంటివి కొన్ని కూరగాయలు, పాలకూర, బచ్చలికూర వంటి ఆకుకూరలతో పాటు సోయాబీన్ నూనెల్లో లభిస్తుంది. ఇది రక్తం గడ్డకట్టడంలో సహాయపడుతుంది.
ఇవి కూడా చదవండి
విటమిన్ K2 (మెనాక్వినోన్): కాలేయం, గుడ్లు, చీజ్ మరియు ఇతర పాల ఉత్పత్తులతో పాటు పులియబెట్టిన ఆహార పదార్థాల ద్వారా లభిస్తుంది. ఇది ఎముకలు, దంతాల ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. విటమిన్ K2 లోపం చాలా అరుదు. ఇది కొన్నిరకాల క్యాన్సర్ వ్యాధుల బారి నుంచి కూడా రక్షిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
విటమిన్ కె ఎందుకు ముఖ్యమైనది?
రక్తం గడ్డకట్టడంలో సహాయపడుతుంది: విటమిన్ కె రక్తం గడ్డకట్టడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది కాలేయంలోని ప్రోటీన్లను సక్రియం చేస్తుంది. ఇది రక్తస్రావం ఆపడంలో సహాయపడుతుంది. శరీరంలో ఈ విటమిన్ లోపం ఉంటే చిన్న గాయాల నుంచి కూడా అధిక రక్తస్రావం అవుతుంది.
ఎముకలను బలోపేతం చేయడం: ఎముకల ఆరోగ్యానికి విటమిన్ కె కూడా చాలా అవసరం. ఇది ఎముకలకు కాల్షియంను బంధించే ఆస్టియోకాల్సిన్ అనే ప్రోటీన్‌ను సక్రియం చేస్తుంది. ఈ విటమిన్ బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: విటమిన్ K2 ధమనులలో కాల్షియం నిక్షేపణను నివారించడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
విటమిన్ కె అధికంగా ఉండే ఆహారాలు
- ఆకుకూరలు: పాలకూర, బచ్చలికూర, బ్రోకలీ, కొల్లార్డ్ గ్రీన్స్.
- పండ్లు: కివి, ద్రాక్ష,అత్తి పండు, బ్లాక్ బెర్రీ, బ్లూబెర్రీ, ప్రూనే పండ్లు
- నూనెలు: సోయాబీన్ నూనె, కనోలా నూనె.
- గుడ్డు పచ్చసొన , పెరుగు, చీజ్ ,వెన్న ,పులియబెట్టిన ఆహారాలు
విటమిన్ కె లోపం ఉంటే కనిపించే లక్షణాలు
- సులభంగా గాయాలు లేదా చిన్న గాయం నుంచి కూడా అధికంగా రక్తస్రావం
- చిగుళ్ళలో రక్తస్రావం
- మలం లేదా మూత్రంలో రక్తస్రావం
- ఎముకలు బలహీనపడటం.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)