హెల్త్‌

హెల్త్‌


హెల్త్‌

నల్లగా నిగనిగలాడుతూ కనిపించే నేరేడు పండు పలు సమస్యలకు దివ్యౌషధంలా పనిచేస్తాయి.. ఈ పళ్లలో ఎన్నో పోషకాలతోపాటు ఖనిజాలు పుష్కలంగా దాగున్నాయి.. యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టిరియల్ లక్షణాలతోపాటు.. విటమిన్ సీ, పొటాషియం, కాల్షియం, ఐరన్, ఫైబర్, టానిన్లు అధికంగా ఉంటాయి. అందుకే ఈ పండును ఆయుర్వేద నిపుణులు.. అమృత ఫలంగా పేర్కొంటారు. నేరేడు పండు ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుందని.. తప్పనిసరిగా తినాలని పేర్కొంటున్నారు.

నేరేడు పండు ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. ఇది రక్త ప్రక్షాళన, జీర్ణక్రియ మెరుగుదల, చర్మ సంరక్షణ, మధుమేహం నియంత్రణ వంటి ప్రయోజనాలను కలిగి ఉంది. నేరేడు పండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకోండి..

రక్తాన్ని శుద్ధి చేస్తుంది: నేరేడు పండులో విటమిన్లు – ఖనిజాలు అధికంగా ఉంటాయి.. ఇవి శరీరంలోని విషపదార్థాలను తొలగించి, రక్తాన్ని శుద్ధి చేస్తాయి.

జీర్ణక్రియ మెరుగుపడుతుంది: నేరేడు పండులో ఫైబర్ అధికంగా ఉంటుంది.. ఇది మలబద్ధకం, ఉబ్బరం, జీర్ణ సమస్యలను నివారిస్తుంది.

చర్మ – జుట్టు సంరక్షణ: నేరేడు పండులో విటమిన్ సి అధికంగా ఉంటుంది.. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.. నల్ల మచ్చలను తగ్గించి.. చర్మ నిగారింపును పెంచుతుంది. ఇంకా జుట్టు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

షుగర్ నియంత్రణ: నేరేడు పండు డయాబెటిస్ లో మేలు చేస్తుంది.. నేరేడు పండు, దాని గింజల్లోని యాంటీఆక్సిడెంట్లు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి,

రోగనిరోధక శక్తి పెరుగుతుంది: నేరేడు పండులోని పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచి.. వ్యాధులను నివారిస్తాయి.

బరువు తగ్గుతుంది: నేరేడు పండులో తక్కువ కేలరీలు ఉంటాయి.. అంతేకాకుండా దీనిలోని ఫైబర్ బరువు తగ్గడానికి సహాయపతుంది.

బీపీ నియంత్రణలో ఉంటుంది: నేరేడు పండులో పొటాషియం అధికంగా ఉంటుంది.. ఇది రక్తపోటును నియంత్రించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది: నేరేడు పండులోని విటమిన్ ఎ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

ఎముకలు దృఢంగా మారుతాయి: నేరేడు పండులోని కాల్షియం ఎముకలు, దంతాల ఆరోగ్యాన్ని కాపాడతాయి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *