ఉదయం నిద్ర లేవగానే నీళ్లు తాగడం ఆరోగ్యకరమని మన పెద్దలు, ఆరోగ్య నిపుణులు పదే పదే చెబుతుంటారు.. ప్రస్తుతం ప్రజల్లోనూ ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగింది. ఉదయాన్నే చాలామంది గోరువెచ్చటి నీళ్లతో తమ రోజును ప్రారంభించటం అలవాటుగా చేసుకుంటున్నారు. కొందరు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తీసుకుంటారు. మరికొందరు గోరువెచ్చటి నీటిలో నెయ్యి కూడా యాడ్ చేసుకుని తీసుకుంటారు. ఏది ఏమైన్నప్పటికీ ఉదయం నిద్ర లేవగానే నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యప్రయోజనాలు పుష్కలంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తప్పక తెలుసుకోవాల్సిందే…
ఉదయం నిద్ర లేచేసరికి శరీరం డీహైడ్రేటెడ్ స్థితిలో ఉంటుంది. నిద్ర లేచిన తర్వాత వెంటనే నీళ్లు తాగడం అవసరం. పొద్దున్నే ఖాళీ కడుపుతో నీళ్లు తాగితే జీవక్రియలు మెరుగుపడుతాయి. కడుపులో యాసిడ్ రిఫ్లక్స్, హార్ట్ బర్న్ సమస్య ఉన్నపుడు నిద్ర లేవగానే నీళ్లు తాగితే సమస్య తీవ్రత తగ్గుతుంది. జీర్ణక్రియ మెరుగవుతుంది. ఉదయమే నీళ్లు తాగితే జీవక్రియల వేగం 24 శాతం పెరుగుతుంది. బ్రేక్‌ఫాస్ట్‌కు ముందు నీళ్లు తాగడం ఆకలి తగ్గించి తక్కువ కేలరీలు తీసుకునేలా చేస్తుంది. అందువల్ల శరీర బరువు త్వరగా తగ్గుతుంది.
ఉదయమే నీళ్లు తాగితే శరీరంలో టాక్సిన్స్ సులభంగా విసర్జించబడి శరీరం శుభ్రపడుతుంది. క్రమంగా రోగనిరోధక శక్తి మెరుగవుతుంది. రోజూ ఉదయాన్నే నీళ్లు తాగే అలవాటు కిడ్నీల్లో రాళ్ల ఏర్పడకుండా నిరోధిస్తుంది. చర్మం పొడిబారి పోకుండా నిరోధిస్తుంది. రక్త ప్రసరణ మెరుగువుతుంది. కొత్త చర్మ కణాల ఉత్పత్తి పెరుగుతుంది. ఉదయమే నీళ్లు తాగడం వల్ల శరీరం రోజంతా శక్తిమంతంగా ఉంటుంది. పరగడుపున నీళ్లు తాగితే మెదడు కూడా చురుకుగా ఉంటుంది. ఉదయం నీళ్లు తాగడం వల్ల చర్మం మెరిసేలా మారుతుంది. వెంట్రుకలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాదు.. మెదడుకు తగినంత ఫ్లూయిడ్ అందడంతో మానసిక స్పష్టత, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి మెరుగవుతుంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..