అదే విధంగా పెరుగులో కాల్షియం, విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. అందువలన ఇది ఎముకలకు బలాన్ని ఇవ్వడమే కాకుండా, ఆస్టియోపోరోసిస్, కీళ్ల నొప్పులు వంటి సమస్యలును నివారిస్తుంది. అందుకే కాల్షియం తక్కువ ఉన్న వారు ప్రతి రోజూ పెరుగు తినాలని చెబుతుంటారు ఆరోగ్య నిపుణులు. అలాగే క్రమం తప్పకుండా పెరుగు తినడం వలన ఇది చర్మాన్ని మెరుగుపరచడమే కాకుండా, మొటిమలను నివారించడంలో సహాయపడుతుంది.