ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు పెద్దలు. మనం ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత సంపన్నంగా ఉన్నట్లు. అయితే కొంత మంది ఆరోగ్యం విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించి చాలా సమస్యలు కొనితెచ్చుకుంటారు. ఎప్పుడూ ఆసుపత్రులకు వెళ్తూ డబ్బు ఖర్చు చేసుకుంటారు. అందుకే ఆరోగ్యాన్ని తప్పక కాపాడుకోవాలని చెబుతుంటారు. అయితే ఆరోగ్యంగా ఉండాలి అం టే మంచి ఆహారపదార్థాలు తీసుకోవాలి. మరీ ముఖ్యంగా కొన్ని ఆహారపదార్థాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఆరోగ్య నిపుణులు, పెద్ద వారు కొన్ని రకాల ఆహారపదార్థాలను కలిపి తీసుకోకూడదని చెబుతుంటారు. అయితే అలానే పండ్లు తినేటప్పుడు కూడా కొన్ని రకాల ఫుడ్ తీసుకోకూడదంట. మరీ ముఖ్యంగా, అరటిపండు, కొబ్బరి కలిపి తినకూడదంట. ఇలా తినడం వలన అనేక సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు.
కొంత మంది తమకు తెలియకుండా కొబ్బరి, అరటి పండు కలిపి తింటుంటారు. కానీ ఇది ఆరోగ్యానికి అస్సలే మంచిది కాదంట. ముఖ్యంగా కిడ్నీ సమస్యలతో బాధపడే వారు ఈ కాంబినేషన్ తినడం చాలా డేజంర్, ప్రాణానికే ప్రమాదకరం అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే? కొబ్బరి, అరటిపండు రెండింటిలో పొటాషియం ఎక్కువ మోతాదులో ఉంటుంది. అందువలన ఇది కిడ్నీల పనితీరుకు చాలా ప్రమాదం అంట.
కిడ్నీల శరీరంలోని విషయపదార్థాలను బయటకు పంపిస్తాయి. ముఖ్యంగా శరీరంలోని అధిక పొటాషియాన్ని ఫిల్టర్ చేసి బయటకు పంపేస్తాయి. అయితే ఈ అరటి పండు, కొబ్బరి కలిపి తినడం వలన, శరీరంలో పొటాషియం ఎక్కవగా పెరుగుతుంది. అయితే కిడ్నీలు సరిగా పనిచేయని వారిలో లేదా కిడ్నీ సమస్యలు ఉన్న వారిలో ఈ ప్రాసెస్ నెమ్మదించి, రక్తంలో పొటాషియం లెవల్స్ పెరుగుతాయి. ఇది ప్రాణాలకే ముప్పు తీసుకొస్తుందంట.
దీని వలన హైపర్ కలేమియా, వికారం, అలసట, గుండె దడ, ఎముకలు వీక్ అవ్వడం, కిడ్నీ సమస్యలు , నరాల వీక్ నెస్ , కార్డియాక్ అరెస్ట్ వంటి సమస్యలు ఎదురు అవుతాయంట. అందుకే, ఎట్టిపరిస్థితుల్లోనూ అరటి పండు, కొబ్బరి కలిపి తినకూడదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.