ఉదయాన్నే అల్లం నీరు తాగటం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. బ్యాక్టీరియా, వైరస్ల నుంచి రక్షణ లభిస్తుంది. ఇన్ఫెక్షన్లు సైతం తగ్గుతాయి. ఈ నీళ్లను రోజూ పరగడుపునే తాగుతుంటే కీళ్లు, మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది..అల్లం నీటితో మైగ్రేన్ని తగ్గించొచ్చు అని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
అల్లం నీరు చెడు కొలొస్ట్రాల్ని తొలగిస్తుంది. కొలొస్ట్రాల్ లెవల్స్ని తగ్గిస్తుంది. దీంతో గుండెకు ఎంతో మేలు జరుగుతుంది. గుండె పనితీరు మెరుగు పడుతుంది. శరీరంలో రక్త సరఫరా పెరుగుతుంది. బీపీ తగ్గుతుంది. బరువు తగ్గాలనుకునేవారు తప్పనిసరిగా అల్లం నీరు తీసుకోవాల్సిందే అంటున్నారు నిపుణులు.
అల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో ఫ్రీ ర్యాడికల్స్ నిర్మూలించబడతాయి. ఫలితంగా క్యాన్సర్ వంటి వ్యాధులు దరిచేరకుండా అడ్డుకోవచ్చు అంటున్నారు నిపుణులు. పసుపులోనూ యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువే. ఇవి క్యాన్సర్ కణాలు పెరగకుండా చూస్తాయి.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం, పసుపు నీళ్లను తాగితే చాలు, చర్మానికి తేమ లభించి మృదువుగా మారుతుంది. చర్మం పగలకుండా కాంతివంతంగా మారుతుంది. చర్మంపై ఉండే మొటిమలు, మచ్చలు కూడా తగ్గిపోతాయి. చర్మం ప్రకాశిస్తుంది. యవ్వనంగా కనిపిస్తారు.
గ్యాస్ట్రిక్ యాసిడ్ ఉత్పత్తిని తగ్గించడంలో అల్లం నీరు అద్భుత ఔషధంగా సహాయపడుతుంది. అల్లం నీరు వాంతులు, వికారాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అల్లం నీరు తయారి కోసం చిన్న అల్లం తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. కప్పు నీళ్లు గోరువెచ్చగా మరిగించండి. ఆ తర్వాత ఆ నీటిలో అల్లం వేయండి. 10 నిమిషాలు అలా ఉంచండి. నీళ్లల్లో నుంచి అల్లం తీసి, ఆ నీటిని తాగండి.