
తెలంగాణ
తెలంగాణ చత్తీస్గడ్ సరిహద్దు ములుగు జిల్లాలోని జలపాతాల సందర్శనకు వెళ్లిన ఏడుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు కారడవిలో దారి తప్పారు.. కాకులుదూరని కారడివిలో చిక్కుకొని వర్షంలో దిక్కు తోచని స్థితిలో హాహాకారాలు చేశారు.. ఆరు గంటలకు పైగా అడివిలో చిక్కుకున్న ఆ విద్యార్థులు.. చివరకు పోలీసులు, అటవీశాఖ సిబ్బంది సాహసంతో సురక్షితంగా బయటపడ్డారు.. జలపాతాల సందర్శనకు అనుమతి నిరాకరించినా అధికారుల కళ్ళుగప్పి అడవిలోకి వెళ్లిన ఈ విద్యార్థులు ముప్పుకొని తెచ్చుకున్నారు. చివరకు సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు….