తెలంగాణ

తెలంగాణ


తెలంగాణ

సైబరాబాద్ పోలీసులకు మరో భారీ నకిలీ సర్టిఫికెట్ ముఠాకు చెక్ పెట్టారు. విదేశాల్లో ఉద్యోగాలు, హైయ్యర్ స్టడీస్ చేయాలని ఆశపడుతున్న అభ్యర్థులను లక్ష్యంగా చేసుకున్న ఓ నకిలీ సర్టిఫికెట్ ముఠా కుకట్‌పల్లిలో దుకాణం తెరిచింది. శ్రీ వ్యాస్ కన్సల్టెన్సీ పేరుతో కార్యకలాపాలకు తెరలేపారు. వీరు యువతీయువకుల డబ్బలు కాజేస్తూ నకిలీ సర్టిఫికేట్స్ అంజేస్తున్నారు. సమాచారం అందడంతో పోలీసులు సోదాలు చేసి ఇద్దరిని అరెస్టు చేశారు.

ఈ ముఠాలో ప్రధాన నిందితులుగా భావిస్తున్న A.హరీష్, M.మహేష్ అనే ఇద్దరు వ్యక్తులు కుకట్‌పల్లిలోని శ్రీ వ్యాస్ కన్సల్టెన్సీ పేరుతో కార్యాలయం నిర్వహిస్తూ, విదేశీ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులకు నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు, మార్కుల పట్టాలు అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కూకట్‌పల్లిలో ఈ కేంద్రంలో సోదాలు నిర్వహించగా.. అనేక నకిలీ సర్టిఫికెట్లు, మొబైల్ ఫోన్లు, కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇప్పటివరకు కనీసం 46 మందికి నకిలీ సర్టిఫేక్స్ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. వీరిలో 24 మంది ఇప్పటికే ఆ పత్రాలతో విదేశాలకు వెళ్లిపోయినట్లు కూడా విచారణలో వెల్లడైంది.

మరింత విచారణలో నిందితులు ఈ నకిలీ సర్టిఫికెట్లు విజయవాడకు చెందిన మోహన్ అనే వ్యక్తి ద్వారా పొందుతున్నట్లు కూడా పోలీసులకు సమాచారం లభించింది. మోహన్‌ కోసం గాలింపు జరుగుతుంది ఈ స్కామ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ ముఠా నెట్‌వర్క్‌పై ఫోకస్ పెట్టారు. యువతను మోసం చేస్తూ, విదేశాల్లో భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టే ఇలాంటి ముఠాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *