తాజా వార్తలు

తాజా వార్తలు


తాజా వార్తలు

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వారమంతా ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయవంతం అవుతుంది. కుటుంబ సభ్యుల మీద ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. దాంపత్య జీవితంలో సమస్యలు తొలగిపోయి అన్యోన్యత పెరుగుతుంది. గృహ, వాహన ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. పిల్లల చదువుల విషయంలో శ్రద్ధ పెట్టడం జరుగుతుంది. జీవిత భాగస్వామి నుంచి ఆశించిన సహాయ సహకా రాలు లభిస్తాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. ఉద్యోగపరంగా ఆశించిన పురోగతి ఉంటుంది. మిత్రుల వల్ల కొద్దిగా డబ్బు నష్టపోయే సూచనలున్నాయి. విదేశీ సంబంధమైన ప్రయ త్నాల్లో ఒకటి రెండు శుభ వార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఆదరణ పెరు గుతుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.

 

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. బంధుమిత్రుల వల్ల అనేక ఇబ్బం దులుండే అవకాశం ఉంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా కలిసి వస్తుంది. ముఖ్యమైన వ్యవహా రాలను సునాయాసంగా పూర్తి చేస్తారు. గృహ, వాహన ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఆర్థిక ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల పరంగా శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. అయితే, పని భారం పెరుగుతుంది. వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. నిరుద్యోగులకు ఇది బాగా కలిసి వచ్చే కాలం. కొందరు మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోవడం జరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు బాగా హుషారుగా సాగిపోతాయి. పిల్లలకు శ్రమ పెరుగుతుంది. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి.

 

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వారమంతా ఎటువంటి సమస్యలూ లేకుండా సాఫీగా సాగిపోతుంది. అనుకున్న పనులు అనుకు న్నట్టు పూర్తవుతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. దైవ కార్యాలు, శుభ కార్యాల మీద ఖర్చు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. విదేశీ సంబంధమైన ప్రయత్నాల్లో ఆశించిన సమాచారం అందుకుంటారు. స్వల్ప ప్రయత్నంతో అధిక లాభాలు పొందుతారు. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. పిల్లల నుంచి ఎక్కువగా శుభవార్తలు వింటారు. ఆర్థిక విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది.

 

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ముఖ్యమైన పనులన్నీ సునాయాసంగా పూర్తవుతాయి. మానసికంగా ఊరట చెందుతారు. అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. ఆర్థిక సమ స్యలు, ఆర్థికపరమైన ఒత్తిళ్లు తగ్గుముఖం పడతాయి. ఇంటా బయటా ప్రాధాన్యం పెరుగుతుంది. మంచి గుర్తింపు లభిస్తుంది. రాజకీయ ప్రయోజనాలు కలుగుతాయి. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడతారు. గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. కుటుంబ జీవితంలో సమస్యలు తొలగిపోతాయి. కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

 

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయపడతారు. ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. కొద్దిగా నిదానంగానే అయినా ప్రతి ప్రయత్నమూ విజయవంతం అవుతుంది. ఎటువంటి సమస్య అయినా కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవుతుంది. పిత్రార్జితం లభించే అవకాశం ఉంది. రాజ కీయ ప్రాబల్యం పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరిగినా అందుకు తగ్గట్టుగా ప్రతిఫలం అందుతుంది. కుటుంబ జీవితంలో సామరస్యం నెలకొంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఒకరిద్దరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవ హరించడం శ్రేయస్కరం. పిల్లలు బాగా కష్టపడాల్సి ఉంటుంది. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

 

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఆర్థికంగా చాలావరకు బాగానే గడిచిపోతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలన్నీ కలిసి వస్తాయి. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. ఉద్యోగంలో మీ పనితీరుకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఖర్చుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండడం మంచిది. పితృవర్గం నుంచి ఆర్థిక ప్రయోజనాలు అందుతాయి. కొద్దిగా అనారోగ్య సమస్యలు, వైద్య ఖర్చులు తప్పక పోవచ్చు. మిత్రుల వల్ల డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. విదేశాల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. పిల్లలు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు.

 

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఈ వారమంతా హ్యాపీగా, సానుకూలంగా గడిచిపోతుంది. అనేక విధాలుగా గౌరవ మర్యాదలు పెర గడంతో పాటు ఏ పని చేసినా చెల్లుబాటవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు విలువ పెరుగు తుంది. మీ సలహాలు, సూచనలతో పాటు, మీ పనితీరు కూడా అధికారులకు నచ్చుతుంది. కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది. వ్యాపారంలో భాగస్వాము లతో, వృత్తి, ఉద్యోగాల్లో సహచరులతో కొద్దిగా సమస్యలుండే అవకాశం ఉంది. ఆరోగ్యం అనేక విధా లుగా మెరుగుపడుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయం సాధించడం జరుగు తుంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు.

 

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

చిన్నా చితకా సమస్యలున్నా మొత్తానికి వారమంతా సానుకూలంగానే సాగిపోతుంది. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాలలో స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగంలో ప్రాభవం పెరగడం, గుర్తింపు రావడం వంటివి జరుగుతాయి. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సంపా దించుకోవడానికి, ఉద్యోగులు ఉద్యోగం మారడానికి అవకాశాలు బాగా మెరుగ్గా ఉన్నాయి. వ్యాపా రాల్లో లాభాలు నిలకడగా సాగిపోతాయి. వృత్తి జీవితంలో క్షణం తీరిక ఉండని పరిస్థితి ఉంటుంది. ఇంటా బయటా శ్రమ, ఒత్తిడి ఉంటాయి. స్వల్ప అనారోగ్యాలకు అవకాశం ఉంది. ప్రేమ వ్యవహా రాల్లో దూసుకుపోతారు. విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. గతంలో ప్రయ త్నించిన పెళ్లి సంబంధం ఇప్పుడు కుదిరే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.

 

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వారమంతా శుభ పరిణామాలు, శుభ వార్తలతో సాగిపోతుంది. ముఖ్యంగా ఉద్యోగ, పెళ్లి ప్రయ త్నాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు. కొన్ని కష్టనష్టాల నుంచి, ఒత్తిళ్ల నుంచి బయటపడ తారు. ఆదాయపరంగా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. ఇంటా బయటా ఆదరాభిమా నాలు, ప్రోత్సాహాలు లభిస్తాయి. కొందరు ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలకు ప్లాన్ చేస్తారు. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. వృథా ఖర్చుల్ని వీలైనంతగా తగ్గించు కోవడం మంచిది. షేర్లు, స్పెక్యులేషన్ల మీద పెట్టుబడులు పెంచడం వల్ల లాభాలు కలుగుతాయి. ప్రేమ వ్యవహారాలు బాగా ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతాయి. ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారమవుతుంది.

 

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఆర్థిక పరిస్థితి సానుకూలంగా సాగిపోతుంది.  వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం బాగా పెరిగే అవకాశం ఉంది. సహోద్యోగులతో చిన్నా చితకా సమస్యలుంటాయి. ఆస్తి, ఆర్థిక విషయాలకు సంబంధించిన ముఖ్యమైన వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గిపోతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు ఉంటాయి. పిత్రార్జితం లభించే అవకాశం ఉంది. గృహ, వాహన ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెంచుతుంది. మంచి పరిచయాలు కలిగే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. పిల్లలు కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. ఆర్థికంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. హామీలు ఉండవద్దు.

 

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఈ వారమంతా శుభవార్తలు ఎక్కువగా వింటారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవు తాయి. మనసులోని కోరికలు ఒకటి రెండు నెరవేరుతాయి. ఆర్థిక పరిస్థితి గతంలో ఎన్నడూ లేనంతగా బాగుంటుంది. అనారోగ్యాలు, ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు ఉపశమనం లభి స్తుంది. అంచనాలకు మించి ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. కుటుంబ జీవితం, దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతాయి. తోబుట్టువులు, సమీప బంధువుల వల్ల కొద్దిగా సమస్యలు కలుగుతాయి. దైవ సంబంధమైన వ్యవహారాల్లో పాలుపంచుకోవడం జరుగుతుంది. ఆర్థికాభివృద్ధికి అవకాశం ఉంది కానీ, కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. పని ఒత్తిడి, పనిభారం ఎక్కువగా ఉంటాయి. ప్రేమ భాగస్వామి మీద ఖర్చు పెరిగే అవకాశం ఉంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.

 

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు కొద్దిగా సంతృప్తికరంగా సాగిపో తాయి. కుటుంబంలో చిన్నపాటి టెన్షన్లు తప్పకపోవచ్చు. వృత్తి, ఉద్యోగాల్లో సంపాదన పెరగడానికి అవకాశం ఉంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. దైవ కార్యాల మీద ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. అధికారులకే కాక, బంధుమి త్రులకు కూడా మీ సలహాలు, సూచనలు బాగా ఉపయోగపడతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో కార్యసిద్ధి, వ్యవహార జయం కలుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపార భాగస్వాములతో, అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు పెట్టుకో వద్దు.

 

 

 

 

 

 

 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *