ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్


ఎంటర్టైన్మెంట్

సినీరంగంలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగిన తారలు చాలా మంది ఉన్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో ఎన్నో సూపర్ హిట్స్ అందించిన ఓ హీరోయిన్.. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. పైన ఫోటోను చూశారు కదా.. అందులో కనిపిస్తున్న భామ ఎవరో గుర్తుపట్టారా..? అప్పట్లో సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఓ వెలుగు వెలిగింది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ముఖ్యంగా తమిళంలో అగ్ర కథానాయికగా స్టార్ స్టేటస్ సొంతం చేసుకుంది. ఒకప్పుడు ఆమెకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. యూత్ లో ఫ్యాన్స్ ఎక్కువగా ఉండేవారు. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమయ్యింది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.. ?

ఇవి కూడా చదవండి:  Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ ప్రేమాయణం.. ఇండస్ట్రీలోనే ఈ సినిమా సంచలనం..

ఆమె మరెవరో కాదు.. సీనియర్ హీరోయిన్ మాళవిక. తమిళ చిత్రపరిశ్రమలో అగ్ర కథానాయిక. ఆమె అసలు పేరు శ్వేత కొన్నూర్ మీనన్. తమిళంలో అనేక చిత్రాల్లో నటించిన మాళవికకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. చాలా బాగుంది సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న మాళవిక.. దీవించండి, శుభకార్యం, నవ్వుతూ బతకాలిరా, ప్రియ నేస్తమా, అప్పారావు డ్రైవింగ్ స్కూల్, చంద్రముఖి వంటి చిత్రాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. అప్పట్లో తమిళంలో స్టార్ హీరోస్ అందరి సరసన నటించి ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది.

ఇవి కూడా చదవండి: Rekha Vedavyas: చాలా నరకం అనుభవించాను.. మానసికంగా కుంగిపోయాను.. టాలీవుడ్ హీరోయిన్..

వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే 2007లో సుమేశ్ మీనన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమైంది. 2009 తర్వాత మరే సినిమా చేయలేదు. కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న మాళవిక.. ఆమధ్యన రీఎంట్రీ ఇచ్చేందుకు ఆసక్తి చూపించింది. కానీ ఇంతవరకు ఏ సినిమా చేయలేదు. సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలతో రచ్చ చేస్తుంది. ఒకప్పుడు నాజుగ్గా ఉన్న మాళవిక.. ఇప్పుడు బొద్దుగా తయారైంది.

 

View this post on Instagram

 

A post shared by Shweta Konnur Menon (@shwetakonnurmenon)

Movie: 13 ఏళ్లుగా బ్లాక్ బస్టర్ హిట్.. ఇప్పటికీ సెన్సేషన్ ఈ సినిమా.. చూస్తూ వణికిపోయిన జనాలు..

Tollywood: ఇండస్ట్రీలోకి ఫ్లాప్ హీరోయిన్.. హిట్ల కంటే ప్లాపులే ఎక్కువ.. కానీ కాలు కదపాలంటే కోట్లు ఇవ్వాల్సిందే..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *