ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుంది ఓ సినిమా. ఎలాంటి హడావిడి లేకుండా సైలెంట్ గా అడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమాకు భారీగా కలెక్షన్స్ వస్తున్నాయి. స్టార్ హీరోహీరోయిన్స్, గ్లామర్ సాంగ్స్ లేకపోయినా థియేటర్లలో సత్తా చాటుతుంది. ఇంతకీ ఈ సినిమా ఏంటో తెలుసా..? అదే మహావతార్ నరసింహ. 2025 జూలై 25న విడుదలైన యానిమేటెడ్ సినిమా ఇది. హోంబాలే ఫిల్మ్స్ సమర్పణలో క్లీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాను శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్, చైతన్య దేశాయ్ నిర్మించారు.మహా విష్ణువు దశావతారాల ఆధారంగా దాదాపు పదేళ్లపాటు వరుసగా సినిమాలు రూపొందించనున్నారు. ఈ యూనివర్స్ లో భాగంగా ఇప్పుడు అడియన్స్ ముందుకు వచ్చిన సినిమా మహావతార్ నరసింహ.
ఇవి కూడా చదవండి: Movie: 13 ఏళ్లుగా బ్లాక్ బస్టర్ హిట్.. ఇప్పటికీ సెన్సేషన్ ఈ సినిమా.. చూస్తూ వణికిపోయిన జనాలు..
అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అద్భుతమైన స్పందన వస్తుంది. ఈ సినిమాకు ప్రస్తుతం IMDBna 9.8 రేటింగ్ కలిగి ఉంది. ఇప్పటివరకు భారతీయ సినిమాల్లో అరుదైన విజయాన్ని సాధించింది. తెలుగుతోపాటు కన్నడ, తమిళం, మలయాళం భాషలలో 2డీ, త్రీడీ వెర్షన్స్ లో రిలీజ్ చేశారు. సుప్రసిద్ధమైన భక్త ప్రహ్లాదుడి కథతో ఈ మూవీ కథను రూపొందించారు. నివేదికల ప్రకారం ఈ సినిమాను కేవలం రూ.4 కోట్లతో నిర్మించగా.. మొదటి రోజే రూ.2.01 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టగా.. ప్రపంచవ్యాప్తంగా రూ.2.29 కోట్లు వసూలు చేసింది.
ఇవి కూడా చదవండి
ఇవి కూడా చదవండి: Tollywood: ఇండస్ట్రీలోకి ఫ్లాప్ హీరోయిన్.. హిట్ల కంటే ప్లాపులే ఎక్కువ.. కానీ కాలు కదపాలంటే కోట్లు ఇవ్వాల్సిందే..
ఈ సినిమా ఇప్పుడు భారతీయ సినిమాలో అత్యంత శాశ్వతమైన పౌరాణిక ప్రాజెక్టులలో ఒకటిగా మారింది. 2037 వరకు ప్రతి రెండు సంవత్సరాలకు ఒక సినిమా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇందులో నరసింహ, పరశురాముడు, కృష్ణ, కల్కి వంటి అవతారాలను చూపించనున్నారు. వద్దే పదేళ్లల్లో విష్ణువు పది దైవిక అవతారాలను చూపించనున్నారు.
ఇవి కూడా చదవండి: Rekha Vedavyas: చాలా నరకం అనుభవించాను.. మానసికంగా కుంగిపోయాను.. టాలీవుడ్ హీరోయిన్..
Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ ప్రేమాయణం.. ఇండస్ట్రీలోనే ఈ సినిమా సంచలనం..