ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్


మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇందులో త్రిష కథానాయికగా నటిస్తుండగా.. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇప్పటివరకు విడుదలైన అప్డేట్స్ సినిమాపై మరింత క్యూరియాసిటిని కలిగించాయి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలోనే కొన్నిరోజులుగా విశ్వంభర స్పెషల్ సాంగ్ గురించి రోజుకో వార్త వినిపిస్తుంది. ఇటీవలే ఈ సాంగ్ షూటింగ్ స్టార్ట్ అయినట్లు సెట్ నుంచి చిరు ఫోటో రిలీజ్ చేశారు మేకర్స్. అలాగే ఈ పాటలో చిరుతో కలిసి బాలీవుడ్ బ్యూటీ స్టెప్పులు వేయనున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి: Rekha Vedavyas: చాలా నరకం అనుభవించాను.. మానసికంగా కుంగిపోయాను.. టాలీవుడ్ హీరోయిన్..

ఇవి కూడా చదవండి

ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. చిరుతో స్పెషల్ సాంగ్ చేసేందుకు బాలీవుడ్ సీరియల్ బ్యూటీ మౌనీ రాయ్ ను ఎంపిక చేశారట మేకర్స్. గణేశ్ ఆచార్య కొరియోగ్రఫీలో భీమ్స్ సంగీతం అందించిన ఈ పాటలో చిరుతో కలిసి స్టెప్పులేయనుంది మౌనీ రాయ్. అయితే దాదాపు 5 నిమిషాలు ఉండే ఈ పాటకు ఆమెకు రూ.50 లక్షల పారితోషికం ఇస్తున్నారని సమాచారం. మౌనీ రాయ్.. హిందీలో ఎక్కువగా పాపులర్ అయిన ముద్దుగుమ్మ. నాగిని సీరియల్ ద్వారా పాన్ ఇండియా లెవల్లో ఫేమస్ అయిన ఈ అమ్మడు.. ఇప్పుడిప్పుడే సినిమాల్లో అవకాశాలు అందుకుంటుంది.

ఇవి కూడా చదవండి:  Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ ప్రేమాయణం.. ఇండస్ట్రీలోనే ఈ సినిమా సంచలనం..

బ్రహ్మాస్త్రం సినిమాలో కీలకపాత్రలో నటించిన మౌనీ రాయ్.. కేజీఎఫ్ మూవీలో స్పెషల్ సాంగ్ చేసింది. ఇక ఇప్పుడు చిరుతో కలిసి స్టెప్పులేయనుంది. సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉంటుందో చెప్పక్కర్లేదు. నిత్యం ఏదోక గ్లామరస్ ఫోటో షేర్ చేస్తుంది.

Movie: 13 ఏళ్లుగా బ్లాక్ బస్టర్ హిట్.. ఇప్పటికీ సెన్సేషన్ ఈ సినిమా.. చూస్తూ వణికిపోయిన జనాలు..

Tollywood: ఇండస్ట్రీలోకి ఫ్లాప్ హీరోయిన్.. హిట్ల కంటే ప్లాపులే ఎక్కువ.. కానీ కాలు కదపాలంటే కోట్లు ఇవ్వాల్సిందే..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *