రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ మూవీ కింగ్ డమ్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇందులో విజయ్ జోడిగా భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా.. సత్యదేవ్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేసింది. సూరి పాత్రలో కనిపించనున్నారు విజయ్. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా భావోద్వేగాల కలయికతో ఈ మూవీ ఉండనున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. బలమైన భావోద్వేగాలత నిండిన అద్భుతమైన కథను కింగ్ డమ్ సినిమాతో తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. జూలై 31న ఈ సినిమా భాహీ హైప్ మధ్య అడియన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలోనే తాజాగా విజయ్ దేవరకొండ, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కలియుగ దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో విజయ్ తోపాటు కింగ్ డమ్ సైతం శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితుల ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందచేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతుంది.