తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని రాహుకేతు క్షేత్రంలో 7 అడుగుల పాము భక్తులను బెదరగొట్టింది. సర్ప దోష నివారణ పూజలు చేసుకునేందుకు వచ్చిన క్షేత్రంలో పాములు చూసిన భక్తులు భయాందోళనకు గురయ్యారు. శ్రీకాళహస్తి ఆలయంలో రూ.750 టికెట్టు కొనుగోలు చేసి రాహు కేతు పూజల్లో పాల్గొనే మండపం మెట్ల వద్ద 7 అడుగులు పాము హల్చల్ చేసింది. దీంతో భక్తులు భయంతో పరుగులు పెట్టారు.
ఆలయంలోని రాహు కేతు పూజ మండపం మెట్ల వద్ద కనిపించిన పామును చూసి భయాందోళనకు గురైన భక్తులు.. వెంటనే ఆలయ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అక్కడే ఉన్న ఆలయ సి.ఎస్.ఓ. సుదర్శన్ రెడ్డి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ సిబ్బంది పామును పట్టుకుని సంచిలో బంధించారు.
వీడియో చూడండి..
ఆ తరువాత రామాపురం అడవుల్లో ఫారెస్ట్ అధికారులు వదిలి పెట్టారు. పామును సేఫ్ గా పట్టు కోవడంతో భక్తులు, ఆలయ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అంతకుముందు కూడా పాములు దర్శనమిచ్చాయని.. ఏమైనా పాములు కనిపిస్తే.. వెంటనే సమచారం ఇవ్వాలని అధికారులు భక్తులను కోరారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..