ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్


టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన కింగ్ డమ్ రిలీజ్ కు సిద్ధమైంది. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ జులై 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మళ్లీ రావా, జెర్సీ వంటి ఫీల్ గుడ్ సినిమాలను తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి తన శైలికి భిన్నంగా కింగ్ డమ్ సినిమాను తెరకెక్కించారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించగా, సత్యదేవ్ మరో కీలక పాత్రలో పోషించాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో సినిమా ప్రమోషన్లలో స్పీడ్ పెంచారు మేకర్స్. ఇప్పటికే హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కలిసి నిర్వహించిన పాడ్ కాస్ట్ స్పెషల్ ఇంటర్వ్యూ కు అభిమానుల నుంచి ఊహించని స్పందన వచ్చింది. సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది.

కాగా శనివారం (జులై 27) తిరుపతి వేదికగా కింగ్ డమ్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో విజయ్ ఎంతో పవర్ ఫుల్ గా కనిపించాడు. మూడు పాత్రలకు తగ్గట్టుగా ఎంతో ఇంటెన్స్ తో మెప్పించాుడు. దీంతో కింగ్ డమ్ అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం కింగ్ డమ్ ట్రైలర్ నెట్టింట బాగా ట్రెండ్ అవుతోంది. యూట్యూబ్ లోనూ రికార్డు వ్యూస్ వస్తున్నాయి. ట్రైలర్ ఎఫెక్ట్ అడ్వాన్స్ బుకింగ్ పై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ట్రైలర్ రిలీజైన తర్వాత కింగ్ డమ్ ప్రీమియర్ టికెట్స్ భారీగా సేల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

భారీగా అమ్ముడవుతోన్న టికెట్లు..

కింగ్ డమ్ సినిమా జూలై 31న పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానుంది. హిందీలో ‘సామ్రాజ్య’ అనే టైటిల్‌తో ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. హిందీతో పాటు తమిళ్ సినిమా ట్రైలర్లు ఈరోజు రాత్రికి విడుదల కావొచ్చని సమాచారం. ఈ సినిమాకు అనిరుధ్ స్వరాలు సమకూర్చడం విశేషం.

కింగ్ డమ్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *