PM Kisan: రాష్ట్ర ప్రభుత్వాలు అయినా లేదా కేంద్ర ప్రభుత్వం అయినా ప్రస్తుతం అనేక రకాల పథకాలను అమలు చేస్తున్నాయి. అదే సమయంలో పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ పథకాల నుండి ప్రయోజనాలను పొందుతున్నారు. ఉదాహరణకు, కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను నిర్వహిస్తోంది. ఈ పథకం ద్వారా మాత్రమే రైతులకు ప్రయోజనాలను అందించాలనే లక్ష్యంగా పెట్టుకుంది.
ఇది కూడా చదవండి: Lifestyle: మద్యం తాగుతున్నారా? ఆయుష్షు ఎంత తగ్గుతుందో తెలుసా? షాకింగ్ రిపోర్ట్
ఈ ప్రధానమంత్రి కిసాన్ యోజనకు అర్హత ఉన్న ఏ రైతు అయినా ఈ పథకంలో దరఖాస్తు చేసుకోవడం ద్వారా ఏటా రూ. 6 వేల ఆర్థిక సహాయం పొందవచ్చు. ఈ డబ్బును రూ. 2 వేల చొప్పుడు మూడు విడతల్లో మొత్తం 6 వేల రూపాయలను రైతులకు అందిస్తోంది కేంద్రం. ఇప్పటి వరకు 19వ విడత విడుదల కాగా, ఇప్పుడు 20వ విడత విడుదల కానుంది. దీనిలో రూ. 2 వేలను అందుకోవాలి. ఈ విడత డబ్బులు ఎప్పుడు వస్తాయోనని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఇది కూడా చదవండి: Car Insurance: ఎలుకలు కారులోని సీట్లు కొరికేస్తే బీమా వర్తిస్తుందా?
20వ విడత ఎప్పుడు విడుదల చేయవచ్చు?
ఈ పథకం కింద 20వ విడత ఎప్పుడు విడుదల చేస్తారు? దీని గురించి ఇంకా అధికారిక సమాచారం వెల్లడి కాలేదు. కానీ రాబోయే రోజుల్లో విడత విడుదల తేదీని ప్రకటిస్తారని భావిస్తున్నారు. అయితే, 20వ విడత ఆగస్టులో విడుదల కావచ్చని భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Gold Price Today: మహిళలకు శుభవార్త.. దిగి వస్తున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..
మీడియా రిపోర్టుల ప్రకారం.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగస్టు 2, 2025న వారణాసిను సందర్శించనున్నారు. అదే సమయంలో ఈ పథకం 20వ విడతను విడుదల చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. రైతులు ఆగస్టు 2న ఖాతాల్లో డబ్బు జమ అవుతుందా అనే విషయంలో ఎదురుచూస్తున్నారు.
ఎవరు అర్హులు? ఎవరు కారు?
ఈ పథకాన్ని అందరూ పొందలేరు. ప్రభుత్వ ఉద్యోగులు, రూ.10,000 కన్నా ఎక్కువ పెన్షన్ పొందేవారు. డాక్టర్లు, ఇంజనీర్లు, CAs లాంటి నిపుణులు.
ఆధార్‌తో లింక్ చేయని బ్యాంకు ఖాతాలు ఉన్నవారు అర్హులు కారు. అలాగే ఈ పథకం పొందుతున్న రైలులు e-KYC పూర్తి చేయకుంటే కూడా డబ్బుల అందవని గుర్తించుకోండి.
ఇది కూడా చదవండి: Dubai Gold Price: భారతదేశంతో పోలిస్తే దుబాయ్‌లో బంగారం ఎంత చౌకగా ఉంటుంది? ఎన్ని గ్రాములు తెచ్చుకోవచ్చు!
ఇది కూడా చదవండి: Post Office: సామాన్యులకు ఇది కదా కావాల్సింది.. రోజుకు 2 రూపాయలే.. రూ.10 లక్షల బీమా.. బెస్ట్ ఇన్ఫర్మేషన్
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి