ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్


చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం హీరో , హీరోయిన్లుగా నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్న వారు చాలా మందే ఉన్నారు. ఇప్పుడు ఇదే జాబితాలోకి చేరింది సారా అర్జున్. నాన్న సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించి మెప్పించిన ఈ పాప ఇప్పుడు హీరోయిన్ గా మారిపోయింది. బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్ హీరోగా నటిస్తోన్న దురంధర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది సారా అర్జున్. ఇటీవలే ఈ టీజర్ రిలీజ్ కాగా అభిమానుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో సారా ఎక్కువగా కనిపించకపోయినా ఆమె లుక్, అప్పియరెన్స్ కు మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోన్న ఈ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కాబోతుంది. కాగా చిన్నతనంలోనే ఎన్నో సినిమాలు, ప్రకటనల్లో నటించింది సారా. పలు హిందీ, తెలుగు సినిమాల్లో ఛైల్డ్ ఆర్టిస్టుగానూ యాక్ట్ చేసింది. స్టార్ హీరోలు, హీరోయిన్లతో కలిసి సూపర్ హిట్ సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకుంది. దురంధర్ కు ముందు మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో కనిపించింది సారా. అందులో చిన్నప్పటి ఐశ్వర్యారాయ్ గా ఎంతో క్యూట్ గా కనిపించింది.

అన్నట్లు సారా అర్జున్ తండ్రి కూడా ప్రముఖ నటుడే. తెలుగుతో పాటు హిందీ, తమిళ్ సినిమాల్లోనూ నటించాడు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన డియర్ కామ్రెడ్ సినిమాలో రష్మికను వేధించే కోచ్ పాత్రలో నటించింది అర్జున్ రాజే. అలాగే ఆనంద్ దేవరకొండ గం గం గణేశాలోనూ ఓ ఇంట్రెస్టింగ్ రోల్ లో మెరిశాడు. అలాగే ఆ మధ్యన వివాదాలు ఎదుర్కొన్న రజాకార్ మూవీలోనూ అదరగొట్టారు అర్జున్ రాజ్. ఇందులో కరుడు గట్టిన నిజాం ప్రభువుగా, నిరంకుశవాదిగా ఖాసీం రజ్వీ పాత్రలో అద్భుతంగా నటించాడు. రజాకార్ సినిమాను చూసి చాలా మంది అతనిని అసహ్యించుకున్నారు. అంతలా ఆ పాత్రలో ఒదిగిపోయాడు అర్జున్ రాజ్. వీటితో పాటు అంజలి, చాందీని చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన ఝాన్సీ వెబ్ సిరీస్ లో క్యాలెబ్ అనే పాత్రలోనూ నటించాడు అర్జున్ రాజ్.

ఇవి కూడా చదవండి

రజాకార్ సినిమాలో అర్జున్ రాజ్..

తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో పలు సూపర్ హిట్ సినిమాల్లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి ప్రేక్షకుల మన్ననలు అందుకున్నాడు. ప్రస్తుతం ఈ నటుడి చేతిలో పలు తమిళ్, హిందీ క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి.

తండ్రి రాజ్ అర్జున్ తో సారా అర్జున్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *