తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కంచె గచ్చిబౌలి భూముల కేంద్రంగా మొదలైన రాజకీయ రచ్చ… కోవర్టు రాజకీయాలు, డైవర్ట్ పాలిటిక్స్ అంటూ నెక్ట్స్ లెవల్‌కి వెళ్లాయి. కేటీఆర్ వర్సెస్ సీఎం రమేశ్ ఎపిసోడ్ మరో మలుపు తిరిగింది. ఇద్దరి మధ్యలోకి తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంట్రీ ఇచ్చారు. రావడం రావడంతోనే కేటీఆర్‌కు బండి సంజయ్ సవాల్ విసిరారు. సీఎం రమేష్‌ను కరీంనగర్‌కు తీసుకొస్తా.. చర్చకు కేటీఆర్ సిద్ధమా? అంటూ బండి ప్రశ్నించారు. పదేళ్లలో కేటీఆర్ అవినీతిపై సాక్షాలతో చర్చకు వస్తామని చెప్పారు. సీఎం రమేష్ వ్యాఖ్యలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధం లేదంటూనే… సీఎం రమేష్ ఆర్థికసాయంతోనే కేటీఆర్ మొదటి సారి గెలిచారని ఆరోపించారు.
అయితే అంతకు ముందు కేటీఆర్ అగ్గి రాజేయడంతో… పొలిటికల్ బాంబులు ఓరేంజ్‌లో పేలాయి. కేటీఆర్ వర్సెస్ సీఎం రమేష్ ఫైట్‌లోకి అధికార కాంగ్రెస్ ఎంట్రీ ఇవ్వడం హాట్‌టాపిక్‌గా మారింది. కంచె గచ్చిబౌలి భూముల కోసం సీఎం రమేష్‌కి ఫ్యూచర్ సిటీలో రూ.16 వందల కోట్లకు పైగా రోడ్ల కాంట్రాక్ట్ ఇచ్చారంటూ కేటీఆర్ పేల్చిన ఒక్క బాంబ్‌కి సీఎం రమేష్ కౌంటర్ బాంబ్‌లు పేల్చారు. తనకు ఆ కాంట్రాక్ట్‌తో సంబంధం లేదంటూనే… కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో నా ఇంటికి వచ్చింది మరిచిపోయారా….? కవిత విచారణ ఆపేస్తే బీజేపీలో BRSను విలీనం చేస్తామన్నది నిజం కాదా…? మాల్దీవులు, అమెరికా ఎలా వెళ్లారో, ఎందుకు వెళ్లారో చెప్పమంటారా…? అంటూ కౌంటర్‌గా మాటల బాంబులు వదిలారు సీఎం రమేష్.
సీఎం రమేష్‌కి ట్వీట్‌తో కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. కంచ గచ్చిబౌలి భూములు, ఫ్యూచర్ సిటీ రోడ్డు కాంట్రాక్ట్‌పై రేవంత్‌తో పాటు సీఎం రమేష్ వస్తే తానూ చర్చకు సిద్ధమన్నారు. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా… విలీనం అంశాన్ని తెరపైకి తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం పుట్టిన పార్టీ బీఆర్‌ఎస్… అలాంటి బీఆర్ఎస్ ఏ పార్టీలోనూ విలీనం అయ్యే ప్రసక్తేలేదన్నారు. భారీ స్కామ్‌లు బయటపడ్డ ప్రతిసారీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం కామన్ అయిపోయిందని ఫైర్ అయ్యారు కేటీఆర్. అంతకుముందు తెలంగాణకు రేవంత్ రెడ్డే పెద్ద కోవర్ట్ అంటూ నిప్పులు చెరిగారు.
సీఎం రేవంత్ కోవర్ట్ అంటూ కేటీఆర్ అన్న కామెంట్స్‌పై కౌంటర్ ఇచ్చారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కేటీఆర్‌కు దమ్ముంటే… ముందు సీఎం రమేష్ ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. సీఎం రమేష్ ఇంటికి కేటీఆర్ వెళ్లారా.. లేదా…? పదేళ్లు అధికారంలో ఆంధ్రావాళ్లతో తిరిగింది మీరా కదా…? అని ప్రశ్నలు సంధించారు. కేటీఆర్ ఇష్టవచ్చినట్లు మాట్లాడటం ఇప్పటికైనా మానుకోవాలని మండిపడ్డారు ఆది శ్రీనివాస్.
ఇదిలా ఉండగానే కేంద్ర మత్రి బండి సంజయ్ వివాదంలోకి ఎంట్రీ ఇవ్వడం మరింత రచ్చగా మారింది. కాంగ్రెస్‌తో సంబంధం లేకుండా సీఎం రమేశ్‌ను కరీంనగర్‌ను తానే తీసుకొస్తానని బండి సంజయ్ సవాల్ విసిరారు. దమ్ముంటే కేటీఆర్ చర్చకు సిద్ధమా అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఈ మాటల యుద్ధం ఎక్కడి వరకు దారి తీస్తుందనే ఉత్కంఠ రాజకీయవర్గాల్లో నెలకొంది.