ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్


చాలా మంది ఇండస్ట్రీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తుంటారు. చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉన్నవారు ముందుగా మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇస్తుంటారు. అదే సమయంలో పలు యాడ్స్ చేసి గుర్తింపు తెచ్చుకుంటారు. నెమ్మదిగా సినిమాల్లో చిన్న చిన్న అవకాశాలు సంపాదించుకుని.. కథానాయికలుగా మారుతుంటారు. కానీ పైన ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మడు మాత్రం ఒక్క యాడ్ తో ఫేమస్ అయ్యింది. ఆమె చిరునవ్వుతో ఉన్న ఫోటో ఇప్పుడు ప్రతి ఒక్కరి ఫోన్ లో కనిపిస్తుంటుంది. అయితే ఒక్క యాడ్ ద్వారా హీరోయిన్ రేంజ్ లో ఫేమస్ అయిన ఈ అమ్మడు.. ఆ తర్వాత మాత్రం సినిమాల్లో నటించలేదు.

ఆమె పేరు నుపుర్ చాబ్రా. అప్పట్లో యూట్యూబ్ లో ఏ లింక్ ఓపెన్ చేసినా మొదట యాడ్ లో ఓ అమ్మాయి ఫోటో కనిపించేది. ట్రెడిషనల్ డ్రెస్ లో ఓ అందమైన అమ్మాయి నవ్వుతూ కనిపించేది. ఆ అమ్మాయి సోషల్ మీడియా ప్రపంచంలో చాలా ఫేమస్ అయ్యింది. కానీ ఆ తర్వాత మరో యాడ్ చేయలేదు. ఆమె పేరు నుపుర్ చాబ్రా. ఇండియాకు చెందిన ఆమె కుటుంబం ప్రస్తుతం అమెరికాలో ఉంటుంది. శాన్ ఫ్రాన్సిస్కో కాలిఫోర్నియా యూనివర్సిటీలో మార్కెటింగ్ బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసింది. ప్రస్తుతం ఫేస్ బుక్ టెక్నికల్ రిక్రూటర్, మార్కెటింగ్ మీడియా మేనేజర్ గా పనిచేసింది.

ఆ సమయంలోనే ఓ యాడ్ చేసింది. పేదరికంలో ఉన్న చిన్న పిల్లలకు సహాయం చేసే స్వచ్చంద సంస్థకు చెందిన ప్రకటనలో కనిపించింది. ఈ యాడ్ ద్వారా చాలా పాపులర్ అయ్యింది. 2020లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయిన సాహిల్ అనే వ్యక్తిని పెళ్లి చేసింది.

ఇవి కూడా చదవండి

Noopur

Noopur

Movie: 13 ఏళ్లుగా బ్లాక్ బస్టర్ హిట్.. ఇప్పటికీ సెన్సేషన్ ఈ సినిమా.. చూస్తూ వణికిపోయిన జనాలు..

Tollywood: ఇండస్ట్రీలోకి ఫ్లాప్ హీరోయిన్.. హిట్ల కంటే ప్లాపులే ఎక్కువ.. కానీ కాలు కదపాలంటే కోట్లు ఇవ్వాల్సిందే..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *