తాజా వార్తలు

తాజా వార్తలు


తాజా వార్తలు

10 ఏళ్లలో 162 విదేశీ పర్యటనలు, విదేశీ బ్యాంకు ఖాతాలు, దాదాపు రూ. 300 కోట్ల కుంభకోణం.. ఘజియాబాద్‌లో 8ఏళ్లుగా నకిలీ రాయబార కార్యాలయం నడిపిర హర్షవర్ధన్ కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విలాసవంతమైన భవనాన్ని అద్దెకు తీసుకుని, ఏ దేశం అధికారికంగా గుర్తించని ‘వెస్టార్క్టికా’ అనే చిన్న దేశం పేరుతో ఫేక్ రాయబార కార్యాలయాన్ని నడిపించాడు హర్షవర్ధన్. వారం రోజుల క్రితమే పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. జైన్ ఉద్యోగ రాకెట్టును నడుపుతున్నాడని, హవాలా మార్గంలో మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు స్పెషల్ టాస్క్ ఫోర్స్ దర్యాప్తులో తేలింది. ఘజియాబాద్ నిర్వహించిన తనిఖీల్లో నకిలీ దౌత్య నంబర్ ప్లేట్లు, నకిలీ పత్రాలు, లగ్జరీ వాచ్‌లు, నాలుగు కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు రూ. 300 కోట్ల కుంభకోణంలో జైన్ ప్రమేయం ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అతడిని సోమవారం కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసకోనున్నారు.

ఈ నకిలీ రాయబార కార్యాలయం 2017 నుంచి నడుస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కాన్సులెట్ కార్యాలయాన్ని ఉపయోగించుకుని జైన్ విదేశాల్లో ఉద్యోగాల పేరుతో ప్రజలను ఆకర్షించేవాడు. భవనం బయట పలు సేవా కార్యక్రమాలు చేసేవాడు. . వివాదాస్పద చంద్రస్వామి, సౌదీ ఆయుధ వ్యాపారి అద్నాన్ ఖషోగ్గితో జైన్ ఫోటోలు దిగడాన్ని పోలీసులు గుర్తించారు. చంద్రస్వామి తనను తాను దేవుడిగా చెప్పుకునేవాడు. పీవీ నరసింహారావు, చంద్రశేఖర్, విపి సింగ్‌లకు ఆధ్యాత్మిక సలహాదారుగా పనిచేశారు. ఆర్థిక అవకతవకలకు సంబంధించి 1996లో అరెస్ట్ అయ్యారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకు చంద్రస్వామి నిధులు సమకూర్చినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.2017లో ఆయన కన్నుమూశారు.

ఖషోగ్గి, అహ్సాన్ అలీతో లింక్..

హర్షవర్ధన్ జైన్‌ను ఖషోగ్గి, అహ్సాన్ అలీ సయ్యద్‌కు పరిచయం చేసింది చంద్రస్వామి అని టాస్క్ ఫోర్స్ పోలీసుల దర్యాప్తులో తేలింది. సయ్యద్.. జైన్‌తో కలిసి మనీలాండరింగ్ కోసం 25 షెల్ కంపెనీలను తెరవడానికి వీరంతా పనిచేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్‌లో జన్మించిన సయ్యద్ తరువాత టర్కిష్ పౌరసత్వం పొందాడు. సయ్యద్ స్విట్జర్లాండ్‌లో వెస్ట్రన్ అడ్వైజరీ గ్రూప్ అనే కంపెనీని నడిపాడు. ఈ కంపెనీ 25 మిలియన్ పౌండ్ల విలువైన బ్రోకరేజ్‌ను సేకరించి స్విస్ ప్రాంతం నుండి పారిపోయిందనట్లు ఆరోపణలు ఉన్నాయి. అతడిని 2022లో లండన్‌లో అరెస్టు చేశారు. ఈ భారీ స్కామ్‌లో జైన్ ప్రమేయం ఎంతవరకు ఉందో పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు.

వెస్టార్కిటికా అంటే ఏమిటి..?

యూఎస్ నేవీ అధికారి అయిన ట్రావిస్ మెక్‌హెన్రీ 2001లో మైక్రోనేషన్ వెస్టార్కిటికాను స్థాపించారు. తనను తాను దాని గ్రాండ్ డ్యూక్‌గా నియమించుకున్నారు. అంటార్కిటికాలో ఉన్న వెస్టార్కిటికా 6,20,000 చదరపు మైళ్ల వైశాల్యాన్ని కలిగి ఉంది. మెక్‌హెన్రీ తనను తాను పాలకుడిగా నియమించుకోవడానికి అంటార్కిటిక్ ఒప్పంద వ్యవస్థలోని లొసుగును ఉపయోగించుకున్నాడు. వెస్టార్కిటికా తనకు 2,356 మంది పౌరులు ఉన్నారని పేర్కొంది. వారిలో ఎవరూ అక్కడ నివసించరు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *