పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ను గుర్తు పట్టారా? గతంలో పలు తెలుగు, హిందీ సినిమాల్లో నటించిన ఆమె ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది. అయితే ఏదో ఒక విషయంతో తరచూ వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో మహిళలపై వేధింపులు, క్యాస్టింగ్ కౌచ్ పై నిత్యం తన గళం వినిపిస్తుంటుంది. ఈ విషయం పక్కన పెడితే హిందూ సంస్కృతి, సంప్రదాయాలను బాగా పాటిస్తుందీ అందాల తార. గతంలో పలు ప్రముఖ ఆలయాలను సందర్శించి పూజలు కూడా చేసింది. తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లోని ఫొటోలు, వీడియోలు చూస్తే ఇది అర్థమవుతుంది. ఇదే క్రమంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ఈ బ్యూటీ షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చాలామంది లాగే తాను రోజంతా ఉపవాసం పాటించానన్న ఆమె రాత్రి 7 గంటలకు మటన్ తిని ఉపవాసం పూర్తి చేశానని తన పోస్టులో పేర్కొంది. పైగా కొట్టు నుంచి తెచ్చుకున్న మటన్‌ను కూడా చూపించింది. దీంతో ఈ పోస్ట్ క్షణాల్లోనే వైరల్ గా మారింది. చాలా మంది నెటిజన్లు ఈ బ్యూటీపై మండిపడుతున్నారు. శ్రావణమాసంలో మటన్ తినడమేమో కానీ ఏకంగా ఉపవాసం రోజు మటన్ లాగించడమేంటని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరనుకుంటున్నారా? తను మరెవరో కాదు ‘ఆషిక్ బనాయా ఆప్నే’ సాంగ్ తో దేశాన్ని ఒక ఊపు ఊపిన బాలీవుడ్ హీరోయిన్ తనుశ్రీ దత్తా.
తెలుగులో నందమూరి బాలకృష్ణ సరసన వీరభద్ర సినిమాలో హీరోయిన్ గా నటించింది తనుశ్రీ. అయితే ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటోన్న ఆమె క్యాస్టింగ్ కౌచ్ కు సంబంధించి తరచూ తన గళం వినిపిస్తోంది. స్టార్ నటులపై సంచలన ఆరోపణలు చేస్తోంది. ఈ క్రమంలోనే శ్రావణమాసం సందర్భంగా మటన్ తిన్నట్లు తెలిపింది.’ శ్రావణమాసం కావడంతో రాత్రి ఏడు గంటల వరకు ఉపవాసమున్నాను. ఆ తర్వాత అధిక పోషకాలున్న పప్పు, మటన్ వండుకుని డిన్నర్ కంప్లీట్ చేశాను. ఉపవాసాలు మరీ కఠినంగా ఉండాల్సిన అవసరం లేదు. ఎవరి అవసరాలకు తగ్గట్లుగా వారు దాన్ని మార్చుకోవచ్చు. నాకైతే ఇలాంటి ఉపవాసమే బాగా పనిచేస్తుంది’ అని పేర్కొంది తనుశ్రీ.
తనుశ్రీ దత్తా లేటెస్ట్ పోస్ట్..
నెటిజన్ల విమర్శలు
కాగా తనూశ్రీ పోస్ట్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. శ్రావణమాసంలో మటన్ తినడమేంటని కామెంట్స్ పెడుతున్నారు. కొందరైతే మీరు అందుకే లావైపోతున్నారంటూ తీవ్రంగా స్పందించాడు. దీనిపై స్పందించిన నటి.. ‘నేను ఎటువంటి డ్రెస్ వేసుకున్నా అందంగానే కనిపిస్తాను. కాబట్టి బొద్దుగా, అందంగా ఉండేవాళ్లను బాడీషేమింగ్ చేయడం ఆపండి’ అంటూ కౌంటర్ ఇచ్చింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..