టాలీవుడ్ క్వీన్ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏమాయ చేశావే సినిమాతో వెండి తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అంతే కాకుండా జెస్సీగా తన నటనతో యూత్ ఫేవరెట్ అయిపోయింది.
ఇక ఈ సినిమా తర్వాత సామ్‌కు వరసగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ రావడం, వచ్చిన ప్రతి సినిమాను చేసి, వరసగా బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. దీంతో ఆ రోజుల్లో టాలీవుడ్ లక్కీ హీరోయిన్గా తన సత్తా చాటింది.
ఇక ఈ మధ్య ఈ బ్యూటీకి తెలుగులో ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు.ఖుషి, సిడెంటాలా హాలో బన్నీ తర్వాత ఈ ముద్దుగుమ్మ చేసిన సినిమాలు లేవు. కానీ నటిగా కాకుండా నిర్మాతగా మారి శుభం మూవీని నిర్మించి, మంచి హిట్ అందుకుంది. అయితే ఈ మూవీ రిలీజ్ తర్వాత సమంత డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో ఎక్కువగా కనిపించడంతో, వీరు ప్రేమలో ఉన్నారు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ అనేక వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.
అయితే ఈ రూమర్స్ వేళ, చాలా రోజుల తర్వాత సమంత తన సోషల్ మీడియా అకౌంట్లో తన ఫొటోలు షేర్ చేసింది. సింపుల్ లుక్‌లో, స్లీవ్ లెస్ బ్లౌస్ , శారీలో బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ షేర్ చేసింది. అందులో ఈ చిన్నది చాలా అందంగా, క్యూట్‌గా ఉంది. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో సమంత క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఈ ముద్దుగుమ్మ అభిమానులు.