బుల్లితెర బ్యూటీ యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. తన మాట తీరుతో ఎంతో మందిని ఆకట్టుకుంది ఈ చిన్నది. ఓ వై పు సినిమాలు, మరో వైపు రియాల్టీ షోలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. ముఖ్యంగా చాలా సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ తన నటతో అందరినీ ఆకట్టుకుంటుంది.
పటాస్ కామెడీ షోతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అమ్మడు, తన కామెడీ, పంచ్ డైలాగ్స్, అల్లరితో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా షోలలో ఈ బ్యూటీ చేసే అల్లరి అందరి మనసుకు హాయినిస్తుంది. తన దైన తీరులో కామెడీ పండిస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది.
ముఖ్యంగా బిగ్ బాస్ కు వెళ్లి తన వాయిస్, ఆట తీరుతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకొని రన్నర్ గా నిలిచిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ కు వెళ్లి వచ్చిన తర్వాత ఈ అమ్మడుకు మరింత పాపులారిటీ వచ్చిందనడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈ అమ్మడు ఎప్పుడూ వరస ఫొటో షూట్స్‌తో కుర్రకారును ఆకట్టుకుంటుంది ఈ చిన్నది.
తాజాగా ట్రెడిషనల్ లుక్‌లో రెడీ అయ్యి పలు ఫొటోలకు ఫోజులిచ్చింది. కొన్ని సార్లు ట్రెండీ లుక్‌లో కనిపిస్తే మరి కొన్ని సార్లు ట్రెడిషనల్ లుక్‌లో దర్శనం ఇస్తుంది. అయితే తాజాగా, ఈ చిన్నది తేల గులాబీ రంగు లెహెంగాలో తన అంద చందాలతో కుర్రకారును మాయ చేస్తుంది.
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా లెహెంగాలో అందంగా రెడీ అయిన ఫొటోస్ తన ఇన్ స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతుండటంతో, బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఈ అమ్మడు అభిమానులు.