తాజా వార్తలు

తాజా వార్తలు


ఆగస్టులో మీకు బ్యాంకుకు సంబంధించిన ఏదైనా ముఖ్యమైన పని ఉంటే వెంటనే అలర్ట్ అవ్వండి. ఈ నెలలో అనేక పండుగలు, సెలవుల కారణంగా బ్యాంకులు చాలా రోజులు మూతపడనున్నాయి. తీరా బ్యాంకుకు వెళ్లాక అది క్లోజ్ ఉంటే ఇబ్బందులు పడతారు. కాబట్టి బ్యాంకులకు ఎప్పుడెప్పుడు సెలవులు ఉన్నాయో ముందే తెలుసుకోండి. రిజర్వ్ బ్యాంక్ సెలవు క్యాలెండర్ ప్రకారం.. ఆగస్టులో వివిధ రాష్ట్రాలు, జోన్లలో బ్యాంకులు మొత్తం 15 రోజులు మూతపడనున్నాయి. దేశంలో బ్యాంకు సెలవులు జోన్ ప్రకారం నిర్ణయించబడతాయి. ప్రతి రాష్ట్రంలో ఒకటి నుండి నాలుగు జోన్లు ఉంటాయి. సెలవు ఉన్న జోన్‌లో ఆ రోజు అక్కడి అన్ని బ్యాంకులు మూతపడతాయి.

ఈ తేదీల్లో బ్యాంకులు బంద్..

  1. ఆగస్టు 3 – ఆదివారం నాడు దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేయబడతాయి. ఈ రోజున త్రిపురలో కేర్ పూజ సందర్భంగా కూడా సెలవు ఉంటుంది.
  2. ఆగస్టు 8 – టెండాంగ్‌లో రమ్ ఫాట్ కారణంగా సిక్కిం, ఒడిశాలో బ్యాంకులు మూతపడతాయి.
  3. ఆగస్టు 9 – రక్షాబంధన్ ఉండడంతో ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో బ్యాంకులు బంద్ ఉంటాయి.
  4. ఆగస్టు 13 – దేశభక్తి దినోత్సవం కారణంగా మణిపూర్‌లో బ్యాంకులు మూసి ఉంటాయి.
  5. ఆగస్టు 15 – స్వాతంత్ర్య దినోత్సవం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడతాయి.
  6. ఆగస్టు 16 – శ్రీ కృష్ణ జన్మాష్టమి, పార్సీ నూతన సంవత్సరం కారణంగా గుజరాత్, మహారాష్ట్రలలో బ్యాంకులు మూతపడతాయి.
  7. ఆగస్టు 26 – కర్ణాటక, కేరళలో గణేష్ చతుర్థి నాడు సెలవు ఉంటుంది.
  8. ఆగస్టు 27 – గణేష్ చతుర్థి కారణంగా ఏపీ, తెలంగాణ, గోవా, గుజరాత్, మహారాష్ట్ర, పంజాబ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి.
  9. ఆగస్టు 28 – నువాఖై కారణంగా ఒడిశా, పంజాబ్, సిక్కింలలో బ్యాంకులు బంద్ ఉంటాయి.
  10. ఆగస్టు 9, 23 – రెండవ, నాల్గవ శనివారాలు కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి.
  11. మరోవైపు ఆగస్టు 10, 17, 24, 31 తేదీలలో ఆదివారం కారణంగా అన్ని బ్యాంకులు బంద్ ఉంటాయి.

లోన్, డిపాజిట్ లేదా ఇతర లావాదేవీలు వంటి ముఖ్యమైన బ్యాంకు పనులను ముందుగానే పూర్తి చేయండి. సెలవుల వల్ల బ్యాంకులు బంద్ ఉంటాయి కాబట్టి మీరు సమస్యలను ఎదుర్కోవచ్చు. బ్యాంకులు బంద్ ఉన్నా.. నెట్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *