అటు నార్త్‌లోనూ ఇటు సౌత్ లోనూ ఎన్నో అంచనాలున్న ఈ సినిమా ఆగస్ట్ 14న రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే వార్ 2 మూవీ నుంచి ఓ దిమ్మతిరిగే ట్రైలర్ రిలీజ్ అయింది. ఆ ట్రైలరే ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్‌లో మాత్రమే కాదు పాన్ ఇండియా లెవల్లో హాట్ టాపిక్ అవుతోంది. దాంతో పాటే ఈ మూవీలో వీరిద్దరి రెమ్యునరేషన్ పై బీటౌన్‌లో ఓ టాక్ బయటికి వచ్చింది. ఇక అకార్డింగ్ టూ ఆ టాక్… వార్ 2 సినిమా కోసం యశ్ రాజ్ ప్రొడక్షన్ దాదాపు 210 కోట్లకు పైగా బడ్జెట్ ను కేటాయించగా… అందులో ఎన్టీఆర్ – హృతిక్ రెమ్యునరేషన్‌లదే మెజారిటీ వాటా అట. ఈ సినిమా కోసం హృతిక్ 48 కోట్ల రూపాయలను రెమ్యునరేషన్‌గా తీసుకుంటుండగా… యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30 కోట్ల రూపాయలను వసూలు చేస్తున్నారట. దీంతో వీరిద్దరి రెమ్యునరేషన్ ఇప్పుడు బీ టౌన్‌లో హాట్ టాపిక్ అవుతోంది. రెమ్యునరేషన్ విషయంలోనూ ఈ ఇద్దరి హీరోల మధ్య పోటా పోటీ యుద్ధమే సాగింది కావచ్చనే కామెంట్ కామెడీగా వస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మంచు వారి పప్పు! చిక్కగా.. చక్కగా…
అశ్లీల చిత్రాలపై ఉక్కుపాదం! OTTలపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం
Balakrishna: మా బాలయ్య బంగారం! అభిమాని కష్టం ఎరిగి.. సాయం చేసిన బాలయ్య