జల్ పల్లిలోని ఆయన ఇంటికి వెళ్లి.. ఆయనతో కలిసి రకరకాల వంటకాలను ఆస్వాదించారు. దాంతో పాటే ఆయనకు ఇష్టమైన వంటకాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే మోహన్ బాబు.. తనకు పప్పు ఇష్టమని.. అది కూడా మంచు వారి పప్పు ఇష్టమంటూ చెప్పారు. పప్పు అందరూ చేస్తారని.. కానీ తన ఇంట్లో లాంటి పప్పు టేస్ట్ ఎక్కడా దొరకదని.. అందుకే తన ఇంటి పేరునే తన పప్పుకు పెట్టా అంటూ చెప్పారు. అంతేకాదు మా ఇంట్లో చేసిన మంచు వారి పప్పును కొంచెం టేస్ట్ చేస్తే చాలు… మొత్తం లాంగించేదాకా వదలవ్ అంటూ.. యాంకర్‌తో సరదాగా కోట్ చేశారు. అయితే మంచు మోహన్ బాబు చేసిన ఈ కామెంట్సే ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దాంతో పాటు పప్పుకు తన ఇంటి పేరు జోడించడం నెట్టింట క్రేజీ రియాక్షన్స్‌కు కారణం అవుతోంది. మరోసారి ఈయన పై ట్రోల్స్ అండ్ మీమ్స్ వచ్చేలా చేస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అశ్లీల చిత్రాలపై ఉక్కుపాదం! OTTలపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం
Balakrishna: మా బాలయ్య బంగారం! అభిమాని కష్టం ఎరిగి.. సాయం చేసిన బాలయ్య