అయితే ఇప్పుడు ఈ ఆకాశ సౌధాన్ని అత్యంత విలాసవంతమైన నివాసాలకు నిలయంగా మార్చారు. అందుకే పలువురు కోటీశ్వరులు, వ్యాపార వేత్తలు, సినిమా సెలబ్రిటీలు కోట్లు కుమ్మరించి ఇక్కడ అపార్ట్ మెంట్స్ కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్లో సాగరకన్యగా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న శిల్పాశెట్టి కూడా బుర్జ్ ఖలీఫాలో ఓ లగ్జరీ ప్లాట్ సొంతం చేసుకుందని బీటౌన్‌లో టాక్. బుర్జ్ ఖలీఫాలో.. మన దేశానికి చెందిన సినీ ప్రముఖలు చాలా మందే ఫ్లాట్స్ కొనుగోలు చేశారు. కొన్ని రోజుల క్రితం మలయాళ సూపర్ స్టార మోహన్ లాల్ ఈ బుర్జ్ ఖలీఫాలో సింగిల్ బెడ్ రూమ్‌ని కొనుగోలు చేశారనే న్యూస్‌తో సౌత్ ఇండియాలో వైరల్ అయ్యారు. ఇందుకోసం ఆయన సుమారు 3.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడని ఆయన నియర్ డియర్స్ కొంత మంది చెప్పారు. ఇప్పుడు శిల్పా శెట్టి కూడా మోహన్ లాల్ మాదిరే… బుర్జ్ ఖలీఫాలో ఓ లగ్జరీ ప్లాట్‌ను సొంత చేసుకుందట. శిల్పా శెట్టి – రాజ్ కుంద్రా… తమ యానివర్సరీ సందర్భంగా.. బుర్జ్ ఖలీఫాలో ఓ లగ్జరీ ఫ్లాట్‌ను రీసెంట్గా కొనుగోలు చేశారట. 19వ అంతస్తులో ఉన్న ఈ ఫ్లాట్‌ను.. సుమారు 50 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిందట ఈ బ్యూటీ. దీంతో ఈ న్యూస్ కాస్తా ఇప్పుడు బాలీవుడ్లో హాట్ టాపిక్ అవుతోంది. అందర్నీ షాకయ్యేలా చేస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అదేంటి.. ఇక్కడ రూ.100 కోట్లు.. మరి అక్కడైతే మరీ రూ.30 కోట్లేనా? NTR పై బాలీవుడ్ చిన్నచూపు!
పోటా పోటీగా రెమ్యునరేషన్స్! మనోడేమో రూ.30 కోట్లు.. ఆయనేమో రూ.48 కోట్లు..!
మంచు వారి పప్పు! చిక్కగా.. చక్కగా…
అశ్లీల చిత్రాలపై ఉక్కుపాదం! OTTలపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం
Balakrishna: మా బాలయ్య బంగారం! అభిమాని కష్టం ఎరిగి.. సాయం చేసిన బాలయ్య