హెల్త్‌

హెల్త్‌


రోజుకు ఒక ఆపిల్ తినడం వల్ల ఆస్పత్రికి దూరంగా ఉండొచ్చని అంటారు. సేమ్ మీ లైఫ్ స్టైల్లో కొన్ని ఆరోగ్యకరమైన మార్పులు చేసుకోవడం ద్వారా మీరు ఆసుపత్రికి వెళ్లకుండా ఉండవచ్చు. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉండడం, అనారోగ్యకరమైన ఆహారం, చెడు జీవనశైలి వల్ల చాలా మంది పదే పదే అనారోగ్యానికి గురవుతారు. దీంతో ఉన్న డబ్బంతా ఆసుపత్రి పాలవుతుంది. అయితే మీ రోజువారీ జీవనశైలిలో కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను చేర్చుకోవడం ద్వారా అనారోగ్యానికి గురికాకుండా ఉండొచ్చు. ఆ అలవాట్లు ఏమిటో చూద్దాం.

ఆరోగ్యకరమైన జీవితం కోసం అనుసరించాల్సిన అలవాట్లు:

నిద్ర :

ఆరోగ్యంగా ఉండటానికి అనుసరించాల్సిన మొదటి చిట్కా మంచి నిద్ర. ప్రతి రాత్రి త్వరగా పడుకోండి, ఉదయం త్వరగా మేల్కొవాలి. మంచి నాణ్యమైన నిద్ర పోవాలి. ఎందుకంటే సరిగ్గా నిద్రపోకపోతే, మీ రోగనిరోధక శక్తి కూడా బలహీనపడుతుంది. దీని కారణంగా మీరు పదే పదే అనారోగ్యానికి గురవుతారు.

వేడి నీరు :

మీరు ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాసు గోరువెచ్చని నీరు త్రాగడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే వెచ్చని నీరు తాగడం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది శరీరం నుండి విషాన్ని తొలగించడానికి సహాయపడుతుంది. ఈ విధానం మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

ధ్యానం :

ప్రతిరోజూ పది నిమిషాలు ధ్యానం చేయండి. ఇలా చేయడం ద్వారా, మీ ఒత్తిడి హార్మోన్లు నియంత్రణలో ఉంటాయి. మీ రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఈ విధానం మీ ఒత్తిడిని తగ్గించడమే కాకుండా శరీర రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

వాకింగ్ :

భోజనం తర్వాత కనీసం పది నిమిషాలు నడవడం అలవాటు చేసుకోండి. ఇలా నడవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరగకుండా నిరోధించవచ్చు. చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటే, మీరు మధుమేహానికి దూరంగా ఉండవచ్చు. అదనం వాకింగ్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

వ్యాయామం :

మీరు ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్, డ్యాన్స్ వంటి ఏదైనా చేయడం మొత్తం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది శరీరానికి శక్తిని అందిస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

ఆరోగ్యకరమైన ఆహారం:

మీరు తినే ఆహారం కూడా మీ ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. కాబట్టి మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలి. పండ్లు, కూరగాయలు తినడంతో పాటు మీరు డ్రై ఫ్రూట్స్, నట్స్, పప్పుధాన్యాలు, గుడ్లు, చేపలు, మొలకెత్తిన ధాన్యాలు మొదలైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలి. ప్రాసెస్ చేసిన, జంక్, వేయించిన ఆహారాలను వీలైనంత వరకు తినకుండా ఉండండి.

మీరు ప్రతిరోజూ చల్లటి స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల మీ శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మీరు రోజంతా చురుకుగా ఉంటారు. నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, రోజుకు రెండుసార్లు పళ్ళు తోముకోవడం అలవాటు చేసుకోండి. అదేవిధంగా భోజనానికి ముందు, టాయిలెట్‌కు వెళ్లిన తర్వాత చేతులను కడుక్కోండి. ఇలా చేయడం ద్వారా ఇన్ఫెక్షన్ల నుండి దూరంగా ఉండవచ్చు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *