ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్


ఈ షోకు బ్యాక్‌ బోన్‌ గా ఉన్న .. స్టార్‌ హోస్ట్ సల్మాన్‌కే బిగ్ ఝలక్ ఇచ్చారట. బిగ్ బ్రదర్‌ అనే డచ్‌ రియాల్టీకి కాపీగా.. 2006లో బిగ్ బాస్ రియాల్టీ షో హిందీలో స్టార్ట్ అయింది. ఫస్ట్ సీజన్‌కు అర్షద్ వార్సీ హోస్ట్‌గా వ్యవహరించగా.. మూడో సీజన్‌ను అమితాబ్‌ బచ్చన్‌ హోస్ట్ చేశారు. ఇక ఆ తర్వాత నాలుగో సీజన్‌ నుంచి సల్మాన్‌ ఖాన్‌ ఈ షోను తన భుజాలపై వేసుకుని తన క్రేజ్‌తో .. తన హోస్టింగ్‌ స్కిల్స్‌తో … ఈ రియాల్టీ షోను టాప్‌ రేటెడ్‌ షోగా తీర్చిదిద్దారు. అంతేకాదు సీజన్స్‌ పెరుగుతున్న కొద్దీ రెమ్యునరేషన్‌ను కూడా భారీగానే అందుకున్నాడు సల్మాన్ ఖాన్. అలా ఇప్పటి వరకు 18 సీజన్లు కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ తొందర్లో సీజన్‌ 19లోకి ఎంటర్‌ అవుతోంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్‌ 19పై ప్రేక్షకుల్లో వ్యతిరేకత పెరిగింది. బిగ్ బాస్ సీజన్ 18 పరమ చెత్త అనే కామెంట్ రావడం.. టీఆర్పీ రేటింగ్‌లో చాలా వెనక పడిపోవడంతో.. ఆ ఎఫెక్ట్ సీజన్ 19పై పడింది. ఈక్రమంలోనే బిగ్ బాస్ మేకర్స్ ఈ షో బడ్జెట్‌లో కోత పెట్టేందుకు ఫిక్స్ అయ్యారట. అందులో భాగంగా.. 200 కోట్లుగా ఉన్న సల్మాన్‌ రెమ్యునరేషన్‌ను 100 కోట్లకు మార్చారట. అంతేకాదు సల్మాన్ కూడా తన రివైజ్‌డ్‌ రెమ్యునరేషన్‌కు అంగీకరించారని.. బాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఫిష్ వెంకట్‌ కుటుంబానికి అండగా సోనూసూద్‌

సమంత రెండో పెళ్లికి ముహూర్తం ఫిక్స్.. ?

‘హృతిక్‌ను కొట్టిపడేసిన యంగ్ టైగర్‌’ అది తెలుగోడి పెర్ఫార్మెన్స్‌ అంటే..!

దుబాయ్ బుర్జ్ ఖలీఫాలో.. ఫ్లాట్ కొన్న స్టార్ హీరోయిన్.. ధర తెలిస్తే.. అవాక్కవ్వాల్సిందే!

అదేంటి.. ఇక్కడ రూ.100 కోట్లు.. మరి అక్కడైతే మరీ రూ.30 కోట్లేనా? NTR పై బాలీవుడ్ చిన్నచూపు!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *