రౌడీ హీరో విజయ్ దేవరకొండ కింగ్ డమ్ మూవీతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే? శనివారం(జూలై 26) సాయంత్రం తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్స్ లో ‘కింగ్డమ్’ ట్రైలర్ రిలీజ్ చేయగా, దీనికి అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే ఈ ట్రైలర్ చివరలో కాంతారా స్టైల్లో ఒక వ్యక్తి కనిపిస్తారు. అయితే ఇప్పుడు నెట్టింట అతను ఎవరు అనే చర్చ జోరుగా సాగుతుంది. కాగా, దాని గురించి తెలుసుకుందాం పదండి!
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈయన అర్జున్ రెడ్డి సినిమాతో రికార్డ్స్ క్రియేట్ చేశారు. ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారి, వరసగా సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈ రౌడీ హీరో ఇప్పుడు కింగ్ డమ్ మూవీతో తన అభిమానుల ముందుకు రాబోతున్నాడు. జూలై 31న ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది.గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో విజయ్ దేవరకొండ సరసన భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తుంది. అలాగే సత్యదేవ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.
ఇక విజయ్ దేవరకొండ అభిమానులు ఈ మూవీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. చాలా రోజుల నుంచి మూవీ రిలీజ్‌కు సిద్ధం అయ్యిందంటూ అనేక వార్తలు వచ్చినప్పటికీ, చాలా సార్లు వాయిదా పడింది. కానీ ఎట్టకేలకు రౌడీ హీరో అభిమానుల్లో ఉత్సాహం నింపడానికి విజయ్ దేవరకొండ కింగ్ డమ్ మూవీతో జూలై 31న థియేటర్లలో సందడి చేయనున్నాడు.
ఈ క్రమంలోనే శనివారం(జూలై 26) సాయంత్రం తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్స్ లో ‘కింగ్డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక ఘనంగా జరిగింది. ఈ ట్రైలర్‌కు ఊహించని రేంజ్లో సప్పందన లభించింది. ట్రైలర్ చూశాక, ఇక బ్లాక్ బస్టర్ ఖాయం అంటున్నారు అభిమానులు. అయితే ట్రైలర్ చివరలో కాంతారా స్టైల్లో ఒక వ్యక్తి కనిపిస్తాడు. అయితే ఇప్పుడు నెట్టింట ఈయన గురించే చర్చ జరుగుతుంది.
దీనిపై ఒకొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. దీనికి కొందరు మాస్క్ ధరించిన వ్యక్తి హీరో నాని అని, మరికొందరేమో, రక్షిత్ శెట్టి అని ఇంకొందరేమో జూనియర్ ఎన్టీఆర్ అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు ఏమనుకుంటున్నారో, కామెంట్స్ రూపంలో తెలియజేయండి