మ్యాచ్ ఐదో రోజు ఉదయం కేఎల్ రాహుల్ (90) సెంచరీకి చేరువలో అవుట్ అవ్వగా, ఆ తర్వాత శుభ్‌మన్ గిల్ (103) కూడా సెంచరీ పూర్తి చేసుకుని నిష్క్రమించాడు. ఈ దశలో రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ క్రీజ్‌లోకి వచ్చి ఇంగ్లాండ్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. ఈ ఇద్దరు బ్యాటర్స్ సంయమనం పాటిస్తూ, పరుగులను రాబడుతూ వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్, టెస్టు క్రికెట్‌లో తన తొలి సెంచరీని సాధించి తన బ్యాటింగ్ సత్తాను చాటుకున్నాడు. రవీంద్ర జడేజాతో కలిసి ఐదో వికెట్‌కు 200 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత్ పరువును నిలబెట్టాడు.