ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్


తెలుగు సినిమా చరిత్రలో ఎంతో లెజెండ్రీ నటులు ఉన్నారు. ఎన్నో విభిన్న పాత్రలు చేసి ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసిన నటీనటులు చాలా మంది ఉన్నారు. ఇక కమెడియన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే.. ఇప్పుడు చాలా వరకు కామెడీ హీరోలే చేస్తున్నారు. కానీ ఒకానొక సమయంలో సినిమాల్లో సపరేట్ కామెడీ ట్రాక్స్ ఉండేవి. ఎంతో మంది కమెడియన్స్ తన నటనతో నవ్వులు పూయించేవారు.. వారిలో దివంగత నటుడు పద్మనాభం ఒకరు.  పద్మనాభం చిన్నతనంలోనే నాటకాల పట్ల ఆసక్తి చూపారు. ఆయన తన కెరీర్‌ను రంగస్థల నటుడిగా ప్రారంభించాడు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కూడా చేశారు. 1950లలో సినిమాల్లో నటించడం మొదలు పెట్టారు. ఆయన మొదటి సినిమా “షావుకారు” (1950)లో చిన్న పాత్రలో కనిపించారు. ఆ తర్వాత “పాతాళ భైరవి” (1951), “మాయాబజార్” (1957), “గుండమ్మ కథ” (1962) వంటి ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు.

ఇది కూడా చదవండి : బాబోయ్..! మేడం మెంటలెక్కించింది..! సీరియల్ బ్యూటీ షేక్ చేస్తుందిగా..!!

పద్మనాభం తనదైన హాస్య శైలి, సహజమైన నటనతో ప్రేక్షకులను అలరించారు. ఆయన హాస్యంలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉండేది. “మిస్సమ్మ” (1955), “అప్పు చేసి పప్పు కూడు” (1959) వంటి సినిమాల్లో ఆయన కామెడీ టైమింగ్ అద్భుతం అనిచెప్పాలి. రవితేజ భద్ర, ప్రభాస్ చక్రం సినిమాలోనూ ఆయన కనిపించి మెప్పించారు. పద్మనాభం 2010, ఫిబ్రవరి 20న చెన్నైలో గుండెపోటుతో మరణించారు. ఆయన మరణం తెలుగు సినిమా రంగంలో తీరని లోటు అనే చెప్పాలి. అయితే లెజండ్రీ కమెడియన్ పద్మనాభం కొడుకు తెలుగులో కమెడియన్ గా రాణిస్తున్నారని మీకు తెలుసా.?

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :మర్యాద రామన్నలో కనిపించిన ఈ కుర్రాడు గుర్తున్నాడా.? అతను ఇప్పుడు టాలీవుడ్ హీరో..

ఆయన ఎవరో కాదు ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా నటించి మెప్పించిన తిరుపతి ప్రకాష్. ఈ కమెడియన్ చాలా సినిమాల్లో తన కామెడీతో మెప్పించారు. జబర్దస్త్ లాంటి కామెడీ షోలోనూ కనిపించి మెప్పించారు. పద్మనాభం తిరుపతి ప్రకాష్ కు పెద్ద నాన్న అవుతారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్నీ ఆయనే తెలిపారు. సినిమాల్లోకి రావడానికి తన పద్మనాభం పెద్దనాన్న సపోర్ట్ చేశారని అని తెలిపారు. ఇక ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అలీ తనకు సపోర్ట్ చేశారని తెలిపారు తిరుపతి ప్రకాష్. ఈ కమెడియన్ ఇప్పుడు పెద్దగాసినిమాల్లో  కనిపించడం లేదు.

ఇది కూడా చదవండి :నాగ చైతన్య ఫస్ట్ మూవీలో కనిపించిన ఈ నటి గుర్తుందా..?ఇప్పుడు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *