ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్


అనసూయ భరద్వాజ్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని ప్రేక్షకులు ఉండరు. బుల్లితెర నుంచి వెండి తెర వరకు తన అందంతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది ఈ చిన్నది. న్యూస్ రీడర్ గా కెరీర్ ప్రాంరంభించి ఆతర్వాత యాంకర్‌గా మారింది ఈ అమ్మడు. యాంకర్‌గా ఎన్నో టీవీషోలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రముఖ టీవీ షో జబర్దస్త్ ద్వారా అనసూయ బాగా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత సినిమాల్లో నటిస్తూ మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇక సినిమాల్లో నటిస్తూ అలరిస్తుంది. సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆతర్వాత వరుసగా సినిమాల్లో అవకాశాలు అందుకుంది. ఇక ఇప్పుడు టీవీ షోలతో పాటు సినిమాల్లోనూ నటిస్తూ బిజీ బిజీగా గడుపుతుంది.

ఇది కూడా చదవండి : బాబోయ్..! మేడం మెంటలెక్కించింది..! సీరియల్ బ్యూటీ షేక్ చేస్తుందిగా..!!

పెళ్ళై ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికీ అందంలో కుర్రహీరోయిన్స్ తో పోటీపడుతోంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ ముద్దుగుమ్మ తన పై వచ్చిన ట్రోల్స్ కు సోషల్ మీడియాలో తనదైన స్టైల్ లో కౌంటర్లు ఇస్తుంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనసూయ తన పై వస్తున్న ట్రోల్స్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. అలాగే సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ తగ్గిపోవడానికి కూడా కారణం తెలిపింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :మర్యాద రామన్నలో కనిపించిన ఈ కుర్రాడు గుర్తున్నాడా.? అతను ఇప్పుడు టాలీవుడ్ హీరో..

అనసూయ మాట్లాడుతూ.. నా గురించి అడ్డగోలుగా మాట్లాడితే వెంటనే నేను సోషల్ మీడియాలో బ్లాక్ చేస్తా అని తెలిపింది. నన్ను టార్గెట్ చేసే వారిని, నా పై నెగిటివ్ కామెంట్స్ చేసేవారిని నేను దాదాపు 3 మిలియన్ మందిని బ్లాక్ చేశా అని తెలిపింది. చాలా మందికి నేను స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాను.. ఇక నేను భరించలేకపోయాను.. నా లైఫ్ లోనే కాదు, ఈ ప్రపంచంలోనే నువ్వు లేవు, ఇకమీదట కూడా కనిపించవు అని చాలా మందిని బ్లాక్‌ చేశాను అని చెప్పుకొచ్చింది అనసూయ. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అనసూయ కామెంట్స్ పై కూడా నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 3 మిలియన్ మందిని బ్లాక్ చేయడం ఏంటి.? నిజం చెప్తే నమ్మేలా ఉండాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

ఇది కూడా చదవండి :నాగ చైతన్య ఫస్ట్ మూవీలో కనిపించిన ఈ నటి గుర్తుందా..?ఇప్పుడు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *