దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోతోంది. దీంతో పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తున్నారు అధికారులు. మధ్యప్రదేశ్లో నిరంతర వర్షాల కారణంగా గ్వాలియర్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలు, అంగన్వాడీలకు సోమవారం సెలవు ప్రకటించారు. అగర్ మాల్వా కలెక్టర్ రాఘవేంద్ర సింగ్ అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర పాఠశాలల్లో నర్సరీ నుండి 12వ తరగతి వరకు విద్యార్థులకు సెలవు ప్రకటించారు. ఉత్తరప్రదేశ్లోని రాంపూర్, అంబేద్కర్ నగర్లలో డిఎం ఈరోజు సెలవు ప్రకటించారు.
బీవర్- ప్రభుత్వ, ప్రభుత్వేతర పాఠశాలలు జూలై 28, 29 తేదీలలో రెండు రోజులు మూసివేయనున్నారు. కలెక్టర్ కమల్ రామ్ మీనా సూచనల మేరకు DEO అజయ్ కుమార్ గుప్తా ఈ ఉత్తర్వు జారీ చేశారు. అయితే వర్షాలు తగ్గుముఖం పడితే తిరిగి 30వ తేదీన పాఠశాలలు తెరుచుకుంటాయని, లేకుండా సెలవులను పొడిగించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
కోట, టోంక్- జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలో 1 నుండి 12వ తరగతి వరకు పనిచేస్తున్న పాఠశాలలు, అంగన్వాడీలు ప్రభుత్వేతర పాఠశాలలకు సెలవులను ప్రకటించారు.
చింతోర్గఢ్- భారీ వర్షాల కారణం, జూలై 28, 29 తేదీలలో 1 నుండి 12వ తరగతి వరకు అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ఉంటుంది.
జైపూర్, ధోల్పూర్- జూలై 28 నుండి 30 వరకు 1 నుండి 12 తరగతి వరకు ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు ఉంటాయి. జిల్లా కలెక్టర్ శ్రీనిధి బిటి ఆదేశాలు జారీ చేశారు. ఈ కాలంలో అంగన్వాడీ కేంద్రాలు కూడా మూసివేయనున్నారు. అలాగే అజ్మీర్ జిల్లాలో కూడా పాఠశాలలకు సెలవులు ప్రకటించారు అధికారులు. ఇవే కాకుండా ఇంకా చాలా రాష్ట్రాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి