ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్


రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్‌డమ్. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కింగ్ డమ్ సినిమా కోసం విజయ్ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు థియేటర్స్ ఓ చూద్దామా అని ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను మళ్ళీరావా, జెర్సీ లాంటి క్లాసిక్ సినిమాలకు దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే కింగ్ డమ్ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్ భారీ హైప్ ను క్రియేట్ చేశాయి. ముఖ్యంగా విజయ్ లుక్ అందరిని ఆకట్టుకుంది. గుండుతో విజయ్ చాలా పవర్ ఫుల్ గా కనిపించాడు. ఈ సినిమా జులై 31న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమా విడుదలకానుంది.

ఇది కూడా చదవండి : బాబోయ్..! మేడం మెంటలెక్కించింది..! సీరియల్ బ్యూటీ షేక్ చేస్తుందిగా..!!

రీసెంట్ గా కింగ్ డమ్ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. ఈ సినిమాలో విజయ్ కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో సత్యదేవ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా విడుదల దగ్గర పడుతుండగా ఈ సినిమా పై హైప్ రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇక ఈ సినిమా పీ రిలీజ్ ఈవెంట్ ను నేడు(28న ) హైదరాబాద్ లో గ్రాండ్ గా జరపనున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :మర్యాద రామన్నలో కనిపించిన ఈ కుర్రాడు గుర్తున్నాడా.? అతను ఇప్పుడు టాలీవుడ్ హీరో..

రాక్ స్టార్ అనిరుద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్, ట్రైలర్ లోని బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంది. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఓ కొత్త సాంగ్ ను విడుదల చేయనున్నారు. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన లైవ్ పర్ఫామెన్స్ తో అదరగొట్టనున్నాడు. అనిరుద్ మ్యూజిక్ కు ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక కింగ్ డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన లైఫ్ పర్ఫామెన్స్ తో దుమ్మురేపనున్నాడు అనిరుద్. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను టీవీ9లో అస్సలు మిస్ అవ్వకండి..

ఇది కూడా చదవండి :నాగ చైతన్య ఫస్ట్ మూవీలో కనిపించిన ఈ నటి గుర్తుందా..?ఇప్పుడు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *