చేతిలో స్మార్ట్ ఉంటే చాలు రీల్స్, ఫోట్స్, సెల్ఫీలంటూ చాలా మంది హంగామా చేస్తుంటారు. సమయం, సందర్బం ఏదైనా సరే వెంటనే ఒక సెల్ఫీ క్లిక్ మనిపించాల్సిందే. సెల్ఫీ మోజులో పడి ఇప్పటికే చాలా మంది ప్రజలు ప్రాణాలు పోగోట్టుకున్న సంఘటన అనేకం వార్తల్లో విన్నాం, చూశాం. తాజాగా అలాంటి విషాద సంఘటన ఝార్ఖండ్‌లో చోటు చేసుకుంది. సెల్ఫీ మోజులో ఒక కుటుంబం జలపాతంలో కొట్టుకుపోయింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఝార్ఖండ్ ధన్‌బాద్ సమీపంలోని భటిండా జలపాతం వద్ద సెల్ఫీ మోజులో నలుగురు జల ప్రవాహంలో కొట్టుకుపోయారు. జులై 27 ఆదివారం రోజున పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒక కుటుంబం జలపాతం చూసేందుకు వచ్చారు. అక్కడే వారంతా సెల్ఫీలు తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు వారిలో ఒకరు జారి నీటిలో పడిపోయారు. వేగంగా ప్రవహించే వాగు దగ్గర సెల్ఫీలు తీసుకుంటుండగా ఒక మహిళ కాలుజారి నీటిలో పడింది. ఆమె నీళ్లలో పడి కొట్టుకుపోవడం చూసి ఆమె భర్త, కొడుకు, కుమార్తె ఆమెను కాపాడటానికి నదిలో దూకారు. కానీ, బలమైన నీటి ప్రవాహం కారణంగా నలుగురూ మునిగిపోవడం ప్రారంభించారు. సమీపంలో చేపలు పడుతున్న స్థానికులు ఈ గందరగోళాన్ని గమనించి వెంటనే సహాయం చేయడానికి పరుగెత్తారు. వారు నీటిలోకి దూకి నలుగురినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
ఈ సంఘటన ప్రసిద్ధ పర్యాటక ప్రదేశంలో భయాందోళనలను రేకెత్తించింది. వేగంగా ప్రవహిస్తున్న నీటిలో మునిగిపోతుండగా స్థానికులు, మత్స్యకారులు సకాలంలో స్పందించి వారిని ప్రాణాలతో కాపాడారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. భటిండా జలపాతంలో సెల్ఫీలు తీసుకుంటూ ప్రమాదాలకు గురైన ఘటనలు గతంలోనూ చాలా సార్లు జరిగాయని స్థానికులు చెబతున్నారు.. 2024 ఆగస్టులో సెల్ఫీలు తీసుకుంటూ ముగ్గురు వ్యక్తులు కొట్టుకుపోగా స్థానికులు వారిని రక్షించారని చెప్పారు. కాగా, తాజాగా ప్రమాదం నుంచి బయటపడిన కుటుంబ సభ్యులను చికిత్స కోసం సమీపంలో ఆసుపత్రికి తరలించారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..