ఎంటర్టైన్మెంట్

ఎంటర్టైన్మెంట్


తమిళ స్టార్ హీరో ధనుష్ ఇవాళ (జులై 28) పుట్టిన రోజు జరుపుకొంటున్నాడు. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ క్రేజీ హీరోకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ధనుష్ గురించి ఫ్యాన్స్ షేర్ చేస్తోన్న పోస్టులు సోషల్ మీడియాలోనూ బాగా వైరలవుతున్నాయి. ఈ క్రమంలోనే ధనుష్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ధనుష్. అయితే కొన్నేళ్ల క్రితం పరస్పర అంగీకారంతో ధనుష్‌ – ఐశ్వర్య విడాకులు తీసుకున్నారు. కాగా ధనుష్- ఐశ్వర్యలకు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. వీరికి లింగ, యాత్ర అని పేర్లు పెట్టుకున్నారు. ప్రస్తుతమున్న జెడ్ జనరేషన్ కు భిన్నంగా తన పిల్లలకు ఇలా లింగ, యాత్ర పేర్లు పెట్టడానికి గల కారణాన్ని ఒక సందర్భంలో వెల్లడించాడు ధనుష్. అదేంటంటే..

ఇవి కూడా చదవండి

సినిమాల్లో స్టార్ హీరోగా వెలుగొందుతున్న ధనుష్ మొదటి నుంచి శివభక్తుడు. షూటింగుల నుంచి కాస్త విరామం దొరికితే చాలు
శైవక్షేత్రాలను దర్శిస్తుంటాడు. ముఖ్యంగా అరుణాచలం, చిదంబరం వంటి ప్రముఖ ఆలయాలకు తరుచూ వెళుతుంటాడీ స్టార్ హీరో.
అలాగే చాలా సార్లు గిరిప్రదక్షణ కూడా చేశాడు. ఇప్పుడు కూడా తను నటించిన ప్రతి సినిమా విడుదలకు ముందు సొంతూరులోని (తేనీ జిల్లా – మల్లింగాపురం) ఉన్న కస్తూరీ మంగమ్మ ఆలయానికి వెళతాడు ధనుష్. అక్కడ ప్రత్యేక పూజలు చేస్తాడు. .తనను నడిపించేది శివయ్యేనని, తాను ఈ స్థాయిలో ఉండడానికి ఆయనే కారణమని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు ధనుష్. అందుకే తన పిల్లలకు కూడా లింగ, యాత్ర అని పేర్లు పెట్టనంటాడు ధనుష్.

కుమారుడి గ్రాడ్యుయేషన్ డే వేడుకలో ధనుష్, ఐశ్వర్య..

ఇక సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే కుబేర తో మరో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు ధనుష్. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ సినిమా రూ. 130 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రస్తుతం ఇడ్లీ కడై అనే సినిమాలో నటిస్తున్నాడీ స్టార్ హీరో. ఇందులో నిత్యా మేనన్ కథానాయికగా నటిస్తోంది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇద్దరు కుమారులతో ధనుష్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *