నేటి వేగవంతమైన జీవనశైలిలో సమయం ఆదా చేయడానికి ప్రజలు తరచుగా వండిన ఆహారాన్ని మళ్లీ మళ్లీ వేడి చేయడం ద్వారా తింటారు.. కానీ ఆయుర్వేదం, ఆధునిక వైద్య శాస్త్రం రెండూ ఈ అలవాటును చాలా ప్రమాదకరమైనవిగా భావిస్తాయి. నిపుణులు చెబుతున్న దాని ప్రకారం.. ఆహారాన్ని మళ్లీ మళ్లీ వేడి చేయడం వల్ల పోషకాలు తక్కువ అవ్వడంతోపాటు.. విషపూరితంగా మారుతాయి. ఇది జీర్ణక్రియను ప్రభావితం చేయడమే కాకుండా, శరీరంలో విషపూరిత అంశాలు పేరుకుపోవడం ద్వారా తీవ్రమైన వ్యాధులకు కూడా కారణమవుతుంది.
వాస్తవానికి, ఆహారాన్ని వృధా కాకుండా ఉండటానికి, వేడిగా వడ్డించడానికి మనం తరచుగా ఓవెన్లో లేదా గ్యాస్‌పై వేడి చేస్తాము.. కానీ అలా చేయడం వల్ల మనం అనవసరంగా క్యాన్సర్‌ను ఆహ్వానిస్తున్నట్లేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆహారాన్ని తరచూ వేడి చేయడం వల్ల ఎలాంటి సమస్యల బారిన పడతామో తెలుసుకోండి..
శరీరానికి హానికరం:
ఆయుర్వేదంలో, మళ్లీ వేడిచేసిన ఆహారాన్ని ‘అంవర్ధక్’ – ‘విర్యేణ’ అని పిలుస్తారు.. అంటే, అలాంటి ఆహారం శరీరానికి ఎటువంటి బలాన్ని ఇవ్వదు లేదా కడుపులో సరిగ్గా జీర్ణం కాదు.. బదులుగా ఇది క్రమంగా శరీరాన్ని బలహీనపరుస్తుంది.. వ్యాధులొచ్చే అవకాశాన్ని పెంచుతుంది.
ఆధునిక శాస్త్రం హెచ్చరిక..
ఆధునిక శాస్త్రం కూడా ఈ హెచ్చరికను ధృవీకరిస్తుంది. WHO ప్రకారం వండిన ఆహారాన్ని మళ్లీ వేడి చేసేటప్పుడు, దాని ఉష్ణోగ్రత కనీసం 70 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోవాలి.. తద్వారా మాత్రమే బ్యాక్టీరియా చనిపోతుంది.. కానీ ఈ ప్రక్రియ ఒక్కసారి మాత్రమే చేయాలి.
క్యాన్సర్ కు కారణం అవుతుంది..
ఆహారాన్ని పదే పదే వేడి చేయడం వల్ల పోషకాలు నాశనమవడమే కాకుండా, కొన్ని ఆహార పదార్థాలు క్యాన్సర్ కారక రసాయనాలను కూడా ఉత్పత్తి చేస్తాయి. ఉదాహరణకు, గుడ్లు లేదా చికెన్ వంటి ప్రోటీన్ ఆధారిత ఆహారాన్ని మళ్లీ వేడి చేయడం వల్ల వాటి ప్రోటీన్ సమతుల్యత దెబ్బతింటుంది.. శరీరం వాటిని జీర్ణం చేసుకోవడం చాలా కష్టమవుతుంది.
ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదం..
అదే సమయంలో, వండిన అన్నం లేదా పాస్తాలో బ్యాక్టీరియా పెరుగుతుంది.. ఇవి మళ్లీ వేడి చేసిన తర్వాత కూడా పూర్తిగా అదృశ్యం కావు.. దీనివల్ల ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదం పెరుగుతుంది. బంగాళాదుంపలు, బ్రెడ్, పకోడీలు, సమోసాలు వంటి వేయించిన ఆహారాలను పదే పదే వేడి చేయడం వల్ల అక్రిలామైడ్ అనే రసాయనం ఏర్పడుతుంది.. ఇది ఎక్కువ కాలం తీసుకుంటే క్యాన్సర్‌కు కారణమవుతుందని నిరూపించబడుతుంది. ఆయుర్వేదం, వైద్య శాస్త్రం రెండూ ఎల్లప్పుడూ ఆహారాన్ని తాజాగా, పరిమిత పరిమాణంలో వండాలని.. అలానే తీసుకోవాలని సలహా ఇస్తున్నాయి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..