కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఒక భారీ కొండచిలువ హల్చల్ చేసింది. ఆదివారం రాత్రి ఓ రెస్టారెంట్ సమీపంలో బారికొండ చిలువ ప్రత్యక్షమైంది. అది సుమారు 8 ఫీట్ల కంటే ఎక్కువ పొడువుగా ఉంది. అంత పెద్ద కొండచిలువను చూసిన స్థానిక జనాలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే అక్కడి నుంచి దూరంగా పరుగులు పెట్టారు. ఎక్కడో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండాల్సిన కొండ చిలువ.. జనవాసల్లోకి రావడంతో వారంతా షాక్ గురయ్యారు. కాసేపటికి తేరుకొని కర్రలతో అక్కడి నుంచి దాన్ని తరిమికొట్టె ప్రయత్నం చేసారు. కానీ ఎవరూ దాని దగ్గరకు వెళ్లే సాహసం చేయలేదు. అలా ప్రయత్నించిన వారిపైకి ఆ కొండ చిలువ దూసుకొచ్చేందుకు ప్రయత్నించింది. దీంతో అక్కడి జనాలంతా బెదిరిపోయి స్నేక్ క్యాచర్, అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న స్నేక్, అటవీవశాఖ అధికారులు దానిని పట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ ఆ 8 అడుగుల కొండ చిలువ వారికి దొరకకుండా చాలా సేపు చుక్కలు చూపించింది. కొండ చిలువ భారీ సైజ్లో ఉండటంతో దాన్ని పట్టుకోవడం వాళ్లకు కష్టంగా మారింది. చివరకు ఎలాగోలా దాన్ని పట్టుకొని ఫారెస్ట్ అధికారులకు అప్పజెప్పారు. అనంతరం ఫారెస్ట్ అధికారులు కొండచిలువను అడవి ప్రాంతంలో వదిలి పెట్టారు. దీంతో స్థానికులంతా ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.