
ఖర్జూరాలు చాలా రుచిగా ఉంటాయి. కాబట్టి, చాలామంది వీటిని ఎప్పుడుపడితే అప్పుడే తింటుంటారు. అయితే, ఖర్జూరం కేవలం రుచిగా ఉండటమే కాదు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అయితే, ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఖర్జూరాలను రోజూ నానబెట్టిన తినడం వల్ల చాలా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు అంటున్నారు నిపుణులు. పూర్తి వివరాల్లోకి వెళితే…
రాత్రి నానబెట్టిన ఖర్జురాలు ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇది జీర్ణక్రియకు సహాయపడతాయి. గ్యాస్, అసిడిటీ లాంటి సమస్యలను తగ్గిస్తుంది. పొట్టను శుభ్రంగా ఉంచుంది. కావాలంటే ఇలా నానబెట్టిన ఖర్జూరాలను పాలు లేదా తేనేతో కలిపి తినొచ్చు అంటున్నారు నిపుణులు. బాదం, అంజూరతో కూడా కలిపి తినడం వల్ల ఆరోగ్యానికి, శరీరానికి మేలు చేస్తుందని చెబుతున్నారు. అయితే, ఎక్కువగా తినడం మంచిది కాదని అంటున్నారు. షుగర్ ఉన్నవారు పరిమితంగా తినాలి.
వర్కౌట్ ముందు నానబెట్టిన ఖర్జూరాలు తింటే తక్షణ శక్తి ఇస్తుంది. గర్భిణీలకు ఐరన్ అందుతుంది. పిల్లలకు పేస్ట్ రూపంలో ఇవ్వొచ్చు. రోజుకు 2-4 ఖర్జురాలు తినడం మంచిది. నానబెట్టిన ఖర్జూరం తినడం వల్ల హానికరమైన కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. నీరసం తగ్గిస్తుంది. రక్తహీనతకు మంచిది. గుండె ఆరోగ్యానికి కూడా మంచిది. అధిక రక్తపోటును నియంత్రిస్తుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..