మనలో చాలా మందికి కాఫీ అంటే ఇష్టం.. టీ తరువాత ఎక్కువ మంది తీసుకునేది కాఫీనే. అయితే, కాఫీలో కాస్త నెయ్యి కలిపితే ఏమౌతుందో మీకు తెలుసా..? ఇటీవలి కాలంలో ఈ నెయ్యి కాఫీ బాగా పాపులర్‌గా మారింది. ఆరోగ్య ప్రయోజనాల రిత్యా చాలా మంది నెయ్యి కాఫీని అలవాటుగా చేసుకుంటున్నారు. నెయ్యి కాఫీ తాగడం వల్ల ఆరోగ్యానికి రెట్టింపు లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే నెయ్యి కలిపిన కాఫీ తాగితే శరీరానికి పోషకాలు అందడం, బరువు తగ్గడం సహా మరిన్ని బెనెఫిట్స్ ఉంటాయని చెబుతున్నారు. అవేంటంటే..
కాఫీలో నెయ్యి కలుపుకుని తాగుతుంటే అది జీర్ణక్రియ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. నెయ్యి కాఫీ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. శక్తి స్థాయిలు పెరుగుతాయి. ఒత్తిడి తగ్గుతుంది. కాఫీలో ఉండే కెఫిన్ మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. నెయ్యిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. నెయ్యి కాఫీలో చక్కెర లేకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. శక్తి నష్టాలను నివారించడం కొవ్వు దహనాన్ని ప్రోత్సహించడం జరుగుతుంది. నెయ్యిలోని కొవ్వులు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.
నెయ్యి కాఫీ పేగులను ద్రవపదార్థం చేస్తుంది. మల విసర్జన సాఫీగా జరగడానికి సహాయపడుతుంది. నెయ్యిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు కడుపు నిండుగా ఉంచుతాయి. నెయ్యిలో బ్యూట్రిక్ యాసిడ్ ఉన్నందున ఉదయాన్నే నెయ్యి కాఫీని తాగడం వలన మెదడు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. కాఫీలో నెయ్యి కలుపుకుని తాగడం వల్ల జ్ఞాపకశక్తి, దృష్టి శక్తిని పెంచుతుంది. నెయ్యి భారతీయుల ఆహారంలో ప్రధాన భాగం. చిన్న పిల్లల నుండి వృద్దుల వరకు ప్రతి ఒక్కరూ నెయ్యిని ఆహారంలో తీసుకుంటారు. నెయ్యి కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కణాలను ఆరోగ్యంగా మార్చుతాయి.
ఇవి కూడా చదవండి
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..