రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ త్వరలోనే కింగ్ డమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా జులై 31న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్లలో స్పీడ్ పెంచారు మేకర్స్. హీరో విజయ్ దేవరకొండ స్వయంగా ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. తాజాగా తన అభిమానుల కోసం ఫ్యాన్స్ మీట్ నిర్వహించాడు విజయ్. హైదరాబాద్‌లోని సారథి స్టూడియోలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వందలాది మంది కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంతో ఓపికగా అడిగిన వారందరికీ ఫొటోలు, సెల్పీలు ఇచ్చాడు రౌడీ హీరో. అంతేకాదు తన కోసం వచ్చిన వారిందరికీ రుచికరమైన వంటకాలు ఏర్పాటు చేశాడు. అభిమానుల కోసం చికెన్, బగారా అన్నంతో పాటు వివిధ వంటకాలు రెడీ చేసి పెట్టారు. ఈ క్రమంలో తమ పట్ల హీరో విజయ్ చూపిన ప్రేమకు అభిమానులు ఫిదా అవుతున్నారు. విజయ్ తో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తు రౌడీ హీరోపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
కాగా మరికాసేపట్లో కింగ్ డమ్ ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది. హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్ ఈ మెగా ఈవెంట్ కు వేదిక కానుంది. ఈ కార్యక్రమానికి విజయ్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున రానున్నారని తెలుస్తోంది. కింగ్డమ్ చిత్రం జులై 31న పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానుంది. ‘జెర్సీ’ మూవీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. సత్యదేవ్ మరో కీలక పాత్రలో మెరిశాడు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. అనిరుధ్ స్వరాలు సమకూర్చారు.
ఇవి కూడా చదవండి
విజయ్ దేవర కొండ ఫ్యాన్స్ మీట్.. వీడియోలు ఇదిగో..
ఫోటో షూట్ అయ్యాక ఫ్యాన్ కీ అన్నంపెట్టడం🫡👌🏻
అన్నదానం కీ మించింది ఏది లేదు🥹❤️
ఫుడ్ టెస్ట్ అదిరింది సూపర్ థాంక్స్ @TheDeverakonda అన్న❤️🫂#KingDom #VijayDeverakonda pic.twitter.com/LwCYRikqIn
— MB Ramesh Nayak🦁 (@Mbramesh_4005) July 28, 2025
తనని కలవడానికి వచ్చిన అభిమానులకు ఒక ఫోటో ఇచ్చి మంచి బిర్యానీ పెట్టించిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ.#VijayDeverakonda #Hyderabad #Kingdom https://t.co/1Y71b6MmSz pic.twitter.com/lWlUD4VtkK
— Telugu Stride (@TeluguStride) July 28, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి